రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల బంద్‌

ABN , First Publish Date - 2021-12-21T17:34:59+05:30 IST

ముడిసరుకుల ధరల పెరుగుదలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పరిశ్రమలు బంద్‌ పాటించాయి. చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలు స్వచ్ఛందంగా బంద్‌లో పాలు పంచుకున్నాయి. రాజధాని బెంగళూరులో

రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల బంద్‌

బెంగళూరు: ముడిసరుకుల ధరల పెరుగుదలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పరిశ్రమలు బంద్‌ పాటించాయి. చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలు స్వచ్ఛందంగా బంద్‌లో పాలు పంచుకున్నాయి. రాజధాని బెంగళూరులో చిన్నతరహా పరిశ్రమల సమాఖ్య (కాసియా) ఆధ్వర్యంలో బంద్‌ ప్రశాంతంగా జరిగింది. కేంద్రం తక్షణం జోక్యం చేసుకుని ముడిసరుకుల ధరలు, ఇంధనల ధరలు తగ్గించాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. కాగా పీణ్యా, రాజాజినగర్‌, బొమ్మసంద్ర పారిశ్రామికవాడలలో పరిశ్రమల కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. ఇది సాంకేతిక నిరసన మాత్రమేనని, రానున్న రోజుల్లో పోరాటం తీవ్రం చేస్తామని పీణ్యా పారిశ్రామికసంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ ప్రకటించారు. 

Updated Date - 2021-12-21T17:34:59+05:30 IST