ఉమెన్‌ సేఫ్టీ స్టేట్‌ తెలంగాణ : మంత్రులు

ABN , First Publish Date - 2020-03-09T09:37:59+05:30 IST

రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సం ఆదివారం నిర్వహించారు.

ఉమెన్‌ సేఫ్టీ స్టేట్‌ తెలంగాణ : మంత్రులు

30 మంది మహిళకు పురస్కారాల ప్రదానం


రవీంద్రభారతి, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో నిష్ణాతులైన 30 మంది మహిళలకు లక్ష రూపాయల నగదు పురస్కారంతో సత్కరించారు. రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ సభాధ్యక్షత వహించిన కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని అన్నారు. రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ భద్రత విషయంలో దేశం మొత్తంలో 66 శాతం సీసీ కెమెరాలు వాడుతున్నది తెలంగాణ రాష్ట్రమేనని అన్నారు.


సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ సమాజంలో సగభాగమైన మహిళలకు సమాన హక్కులు ఉండాల్సిందేనని అన్నారు. ఈ కార్యక్రమంలో శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వరరెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ దివ్య, సంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ, కార్పొరేటర్లు హేమలత, దీప, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు మహిళా సాధికారిత ఉద్దేశిస్తూ సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. 


పురస్కారగ్రహీతలు వీరే...

సయ్యద్‌ సల్వా ఫాతిమా(పైలట్‌), మల్లారి జమ్ము, పల్లె వాణి, మంగ్లీ సత్యవతి (జానపద కళలు), వంగిపురం నీరజదేవి(శాస్త్రీయ నృత్యం), ఐనంపూడి శ్రీలక్ష్మీ, సూర్య ధనుంజయ్‌(సాహిత్యం), లక్ష్మీరెడ్డి( పెయింటింగ్‌), మంజులా కళ్యాణ్‌, బొండ రమాలీల(సర్వీస్‌ టు చిల్డ్రన్‌ స్పెషల్‌ నీడ్స్‌), సరిత ( ఉమెన్‌ రైట్స్‌) స్రవంతి(అచీవర్‌ అగైస్ట్‌ ఓడ్స్‌), దీక్షిత, శ్యామల గోలి (స్పోర్ట్స్‌), నిర్మలారెడ్డి(జర్నలిజం), బెగరి లక్ష్మమ్మ(అగ్రికల్చర్‌), మిల్కూరి గంగవ్వ(సోషల్‌ మీడిమా), మంజూల రెడ్డి(సైన్స్‌ రీసర్చ్‌), పి.అనిత, శారద, పునమ్‌ కవిత, (హెల్త్‌ సర్వీసెస్‌), సంధ్యారాణి, సౌజన్య, యమునాబాయి(ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ డెవల్‌పమెంట్‌ సర్వీసెస్‌), మనీష సాబు(లీడర్‌షిప్‌ ఇన్‌ కార్పొరేట్‌), ఉషారాణి మన్నె ( ఎంటర్‌ప్రినర్‌షిఫ్‌), డా.అంజలీదేవి(మెడిసిన్‌), డా.అరుణదేవి(యోగా), సరోజ బజాజ్‌, మమతా రఘువీర్‌(సోషల్‌ సర్వీస్‌) 

Updated Date - 2020-03-09T09:37:59+05:30 IST