ఆందోళనకు సిద్ధమవుతున్న రాష్ట్ర జేఏసీ

ABN , First Publish Date - 2020-09-30T11:29:45+05:30 IST

ఏపీ రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల సంయుక్త కమిటీ (స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ జాయిం ట్‌ యాక్షన్‌ కమిటీ) ఆధ్వర్యంలో రాష్ట్ర ..

ఆందోళనకు సిద్ధమవుతున్న రాష్ట్ర జేఏసీ

ఎర్రగుంట్ల, సెప్టెంబరు29: ఏపీ రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల సంయుక్త కమిటీ (స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ జాయిం ట్‌ యాక్షన్‌ కమిటీ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబందించి జేఏసీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌, జనరల్‌ సెక్రటరీ ఎం.వేదవ్యాసరావు, కన్వీనర్‌ బి.సాయిక్రిష్ణ ఆధ్వర్యంలోని బృందం ట్రాన్స్‌కో సీఎండీ, జెన్‌కో ఎండీలకు  మంగళవారం ఆ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. ముఖ్యంగా ఏపీ జెన్‌కో యాజమాన్యం ఇటీవల ఫర్పార్మెన్స్‌ లింక్‌డ్‌ జనరేషన్‌ అలవెన్సును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇవికాక మరికొన్ని సమస్యలను పరిష్కరించాలని వారు ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా అక్టోబరు 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నల్లబ్యాడ్జీలతో నిరసన, 26 నుంచి 31 వరకు  వర్క్‌టు టైం,  నవంబరు 2వ తేదీ నుంచి 7 వరకు భోజన విరామ సమయంలో ఆందోళన, 9 నుంచి 14 వరకు రిలే నిరాహార దీక్షలు, 16న మాస్‌ ర్యాలీ నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి అన్ని ప్లాంట్లు, డివిజన్‌కు చెందిన ఉద్యోగులకు కూడా సమాచారం ఇచ్చామన్నారు. 

Updated Date - 2020-09-30T11:29:45+05:30 IST