Satyapradasahu: ఆధార్‌తో ఓటరు కార్డు అనుసంధానానికి 6బీ ఫారం చాలు : ఈసీ

ABN , First Publish Date - 2022-08-27T13:46:11+05:30 IST

ఓటరు గుర్తింపుకార్డుతో ఆధార్‌ అనుసంధానానికి 6బీ ఫారం జతచేస్తే చాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు(The chief election officer of

Satyapradasahu: ఆధార్‌తో ఓటరు కార్డు అనుసంధానానికి 6బీ ఫారం చాలు : ఈసీ

పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 26: ఓటరు గుర్తింపుకార్డుతో ఆధార్‌ అనుసంధానానికి  6బీ ఫారం జతచేస్తే చాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు(The chief election officer of the state is Satya Pradasahu) స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులతో దేశవ్యాప్తంగా ఈ నెల 1వ తేదీ నుంచి ఓటరు కార్డుతో ఆధార్‌ అనుసంధాన పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 97 లక్షల మందికి పైగా ఆధార్‌ వివరాలను ఓటరు జాబితాతో అనుసంధానించారు. దీనిపై సచివాలయంలో శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు మీడియాతో మాట్లాడుతూ... ఓటరు నమోదు ప్రక్రియ అధికారుల వద్ద ఆధార్‌(Aadhaar) అనుసంధానానికి 6బీ ఫారం జతచేస్తే సరిపోతుందని, ఆధార్‌, ఓటరు గుర్తింపుకార్డు తదితర ధ్రువీకరణ పత్రాల నకళ్లను సమర్పించాల్సిన అవసరం లేదని సత్యప్రదసాహు తెలిపారు.

Updated Date - 2022-08-27T13:46:11+05:30 IST