స్టార్టప్ ర్యాంకింగ్‏లో Karnataka నెంబర్ వన్

ABN , First Publish Date - 2022-07-06T17:59:50+05:30 IST

స్టార్టప్ రంగంలో కర్ణాటక శరవేగంగా దూసుకుపోతోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్‌ జాబితాలో అత్యుత్తమ సాధనతో ఏ కేటగిరీలో

స్టార్టప్ ర్యాంకింగ్‏లో Karnataka నెంబర్ వన్

- పలు విభాగాల్లో అత్యుత్తమ స్థానం 

- చాంపియన్‌ పురస్కారాలు అందుకున్న అధికారులు

- రానున్న రోజుల్లో మరింత ఊతం: సీఎం 

- అధికారులకు అభినందనలు


బెంగళూరు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): స్టార్టప్ రంగంలో కర్ణాటక శరవేగంగా దూసుకుపోతోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్‌ జాబితాలో అత్యుత్తమ సాధనతో ఏ కేటగిరీలో కర్ణాటక అగ్రభాగాన నిలబడింది. గుజరాత్‌, మేఘాలయ కంటే మెరుగైన స్థానాన్ని చేజిక్కించుకుంది. అత్యుత్తమ సాధన, అత్యుత్తమ కార్యనిర్వహణ, అత్యుత్తమ నాయకత్వం, అత్యుత్తమ వర్ధమాన లీడర్‌షిప్‌ తదితర రంగాల్లో ర్యాంకులను కేటాయించారు. ఇప్పటికే స్టార్టప్‌ విధానాలను ప్రకటించి వెన్నుదన్నుగా నిలబడిన రాష్ట్రాలకు ర్యాంకింగ్‌ రూపకల్పన సమయంలో ప్రాధాన్యత కల్పించారు. రాష్ట్ర ఐటీబీటీ అదనపు ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ ఈవీ రమణారెడ్డి, డైరెక్టర్‌ మీనా నాగరాజ్‌ స్టార్టప్‌ చాంపియన్‌ పురస్కారాలను అందుకున్నారు. వీరిద్దరినీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై బెంగళూరులో మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రానికి స్టార్టప్‌ రంగంలో టాప్‌ ర్యాంకు లభించడం సంతోషంగా ఉందన్నారు. ఆవిష్కరణలకు ఊతమిస్తూ సాంకేతిక ప్రగతికి పెద్దపీట వేస్తూ జరుగుతున్న కృషికి స్టార్టప్‌ పురస్కారం మరింత వన్నె తెచ్చిందన్నారు. కర్ణాటకలో 20వేలకు పైగా స్టార్టప్‏లు సేవలందిస్తున్నాయి. 6లక్షల మంది నేరుగాను, 12లక్షల మంది పరోక్షంగా ఉపాది అందుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా ఐటీబీటీ శాఖ మంత్రి డాక్టర్‌ సీఎన్‌ అశ్వత్థనారాయణ కూడా హాజరయ్యారు. అన్ని విభాగాలలోనూ ఆవిష్కరణలు కొవిడ్‌ అవధిలోనూ నిరాటంకంగా కొనసాగాయని రాష్ట్ర స్టార్టప్‌ రంగాన్ని దేశంలోనే అగ్రగామి స్థాయికి తీసుకెళ్లేందుకు ఇవి బాగా దోహదపడ్డాయన్నారు. రానున్న రోజుల్లో బడ్జెట్‌లో స్టార్టప్‌ రంగానికి ఊతమిచ్చేలా ఆలోచన ఉందన్నారు. మౌలిక సదుపాయాలు, ఆరోగ్య, ప్రజోపయోగ, రవాణా రంగాల్లో స్టార్టప్‌ దూసుకువెళుతోందని, ప్రజల జీవనప్రమాణాలను సులభతరం చేస్తోందని పేర్కొన్నారు. 


నివాసయోగ్య నగరాల్లో బెంగళూరు మరింత దిగువకు...

ఎకనామిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్స్‌ జరిపిన సమీక్షలో నివాస యోగ్యమైన నగరాల జాబితాలో రాజధాని బెంగళూరు 146వ స్థానానికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 173 నగరాల్లో ఈ సంస్థ సమీక్ష నిర్వహించింది. భారతదేశానికి సంబంధించినంతవరకు నివాసయోగ్యమైన నగరాల జాబితాలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంటే ఆ తదుపరి స్థానాలను ముంబై, చెన్నై, అహ్మదాబాద్‌ నగరాలు ఆక్రమించాయి. బెంగళూరుకు చివరిస్థానం లభించింది. మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, సంస్కృతి, పర్యావరణం, తదితర అంశాల ఆధారంగానే సమీక్ష నిర్వహించి ర్యాంకులు ఇచ్చినట్టు సంస్థ నగరంలో మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అతివేగంగా విస్తరిస్తున్న బెంగళూరు నగరంలో ‘కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’కూడా బాగా పెరుగుతోందని నివేదికలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-06T17:59:50+05:30 IST