డీసెట్‌ ప్రక్రియ ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-11T05:34:09+05:30 IST

రెండేళ్ల డీఎడ్‌ షెడ్యూల్‌ ప్రక్రియ ఈనెల 9 నుంచి 31వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నమయ్య జిల్లా డీఈవో, రాయచోటి డైట్‌ ప్రిన్సిపాల్‌ వై.రాఘవరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

డీసెట్‌ ప్రక్రియ ప్రారంభం

రాయచోటిటౌన్‌, ఆగస్టు 10:  రెండేళ్ల డీఎడ్‌ షెడ్యూల్‌ ప్రక్రియ ఈనెల 9 నుంచి 31వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నమయ్య జిల్లా డీఈవో, రాయచోటి డైట్‌ ప్రిన్సిపాల్‌ వై.రాఘవరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 9 నుంచి 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో వెబ్‌ ఆప్షన్స్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా ఇచ్చుకోవాలన్నా రు. వెబ్‌ ఆప్షన్స్‌ తీసుకున్న వారికి ఈ నెల 16 నుంచి 18వ తేది వరకు సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ఆగస్టు 19 తేదీ నుండి అడ్మిషన్‌ లెటర్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. ఆగస్టు 20 నుంచి 22వ తేదీ వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందన్నారు. ఆగస్టు 31 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలియజేశారు.  

Updated Date - 2022-08-11T05:34:09+05:30 IST