యూపీ, పంజాబ్‌, సిక్కింలో బడుల ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-19T06:28:28+05:30 IST

ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, సిక్కిం రాష్ట్రాల్లో సోమవారం నుంచి 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు బడులు తిరిగి తెరుచుకోనున్నాయి.

యూపీ, పంజాబ్‌, సిక్కింలో బడుల ప్రారంభం

9-12 తరగతుల విద్యార్థులకు మాత్రమే

న్యూఢిల్లీ, అక్టోబరు 18: ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, సిక్కిం రాష్ట్రాల్లో సోమవారం నుంచి 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు బడులు తిరిగి తెరుచుకోనున్నాయి. కంటైన్మెంట్‌ జోన్లలోని స్కూళ్లపై మాత్రం నిషేధం కొనసాగనుంది. మిగతా స్కూళ్లలో భౌతిక దూరాన్ని పాటిస్తూ 50% మంది విద్యార్థులు బడికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయా ప్రభుత్వాలు సూచించాయి.


మిగతా 50% మంది విద్యార్థులకు ఆ తర్వాతి రోజు క్లాసులు ఉంటాయి. తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రాలు ఉన్న విద్యార్థులను మాత్రమే అనుమతిస్తాను. 6-8 తరగతులకు నవంబరు 2 నుంచి, 3-5 తరగతులకు నవంబరు 23 నుంచి ప్రారంభం కానున్నాయి.


Updated Date - 2020-10-19T06:28:28+05:30 IST