ధాన్యం కొనుగోళ్లు షురూ

ABN , First Publish Date - 2022-04-18T05:30:00+05:30 IST

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయచట్టాలతో ఈ యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.

ధాన్యం కొనుగోళ్లు షురూ
బాన్సువాడలో కొనుగోలు కేంద్రాన్ని ప్రార ంభిస్తున్న స్పీకర్‌ పోచారం



 జిల్లాలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం
 యాసంగిలో 4 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోళ్లే లక్ష్యం
 345 కేంద్రాల ఏర్పాటుకు అధికారులు కసరత్తు
 ఇప్పటివరకు 30 కేంద్రాలు ప్రారంభం
 200 మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్లు

కామారెడ్డి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయచట్టాలతో ఈ యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. దీంతో ధాన్యం కొనుగోళ్లపై సం దిగ్ధత నెలకొంటూ వచ్చింది. ఎట్టాకేలకు రైతుల ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్‌లో పాటు ప్రభు త్వం ఇటీవల ప్రకటించింది. దీంతో ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన ఆదేశాలు రావడంతో జిల్లా అధికారులు కొను గోళ్ల కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికను రూపొందించారు. జిల్లాలో ఈ యాసంగిలో 4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతులకు గిట్టుబాటు కల్పించేందుకు జిల్లా అధికారులు పూర్తి ఏ ర్పాట్లు చేశారు. యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 345 కొనుగో లు కేంద్రాలను ఏర్పాటుతో పాటు అవసరమైన గన్నీ బ్యాగులు, ట్రాన్స్‌పోర్టు, ఇతర సౌకర్యాలు కల్పించనున్నారు.
4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం
ఈ యాసంగి సీజన్‌లో జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. ప్రధానంగా నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాలువ దిగువన నిజాంసాగర్‌, బాన్సువాడ, బీర్కూర్‌, బిచ్కుంద, నస్రుల్లాబాద్‌, పోచారం ప్రాజెక్టు కింద ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాలతో పాటు మాచారెడ్డి, దోమకొండ, కామారెడ్డి మండలాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. ఈ లెక్కన యాసంగిలో 4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ, పౌరసరఫరాల అధికారులు అంచనా వేశారు. అయితే కొనుగోళ్లు కేంద్రాలకు 3.60 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ దిగుబడులకు తగ్గటుగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇటీవల యాసంగి ధాన్యం కొనుగోళ్లపై సోమవారం కలెక్టర్‌ జితేష్‌వి.పాటిల్‌ సంబంధిత శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించారు.
ట్రాన్స్‌పోర్టుపై 10 క్లస్టర్‌లు
జిల్లాలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించేందుకు గతంలో ట్రాన్స్‌పోర్టు ఇబ్బందులు తలెత్తడంతో ఆ అనుభావాలను దృష్టిలో పెట్టుకొని సమస్య తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని రైస్‌మిల్లకు తరలించేందుకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు. 10 క్లస్టర్‌లుగా విభజించారు. రెండు మండలాలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటుచేశారు. ఈ క్లస్టర్‌ల నుంచి ప్రతీ రోజు 250 నుంచి 350 లారీల ద్వారా ధాన్యాన్ని రైస్‌మిల్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ట్రాన్స్‌పోర్టు నిర్వాహకులు జిల్లాలోని లారీలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పు గోదావరి, విశాఖపట్నం, మహారాష్ట్ర నుంచి లారీలను తెప్పించనున్నారు.
జిల్లా వ్యాప్తంగా 345 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు..
జిల్లాలో యాసంగిలో వరి ధాన్యం కొనుగోళ్ల కోసం 345కేంద్రాలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేయనుంది. రైతులకు ప్రభుత్వం ప్రకటిం చిన మద్దతు ధరకు ఽధాన్యం కొనుగోలు చేసేందుకు పీఏసీఎస్‌, ఐకేపీల, మార్కెట్‌ యార్డుల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలోని బాన్సువాడ, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల్లో సుమారు 30 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కేంద్రాలనుంచి 200 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పుడిప్పుడే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరో వారం రోజుల్లో పెద్దమొత్తంలోనే రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తరలించే అవకాశం ఉంది. ధాన్యం సేకరణకు 1.25 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం కాగా ఇప్పటికే 60లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా కొనుగోలు కేంద్రాల కు అవసరమైన ప్యాడి క్లీనర్లు, తేమ శాతం కొలిచే యంత్రాలు, ఎలకా్ట్రని క్‌ కాంటాలు, గన్నీ సంచులను అందుబాటులో ఉంచనున్నారు. రైతుల కు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఒక్కో కొనుగోలు కేంద్రం వద్ద ఐదుగురు సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. ఎండలు మండుతున్నం దున తాగు నీటి వసతి, టెంట్లను అందుబాటులో ఉంచనున్నారు. యా సంగి సీజన్‌లో రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. ఏ గ్రేడ్‌ వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.1960లు, కామన్‌ గ్రేడ్‌ ధాన్యానికి క్వింటాలుకు రూ.1940ల మద్దతు ధరను కేటాయిం చింది. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ప్రభుత్వమే మద్దతు ధరకు ఈ కేంద్రాల ద్వారా కొనుగోలు చేయనుంది. ధాన్యాన్ని కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇలా రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధర వచ్చే విధంగా పూర్తి ఏర్పాట్లు చేశారు.
కొనుగోళ్లు చేపడుతున్నాం..
- చంద్రమోహన్‌, అదనపు కలెక్టర్‌, కామారెడ్డి

యాసంగిలో ధాన్యం కొను గోళ్లకు జిల్లాలో ఏర్పాట్లు చేస్తు న్నాం. ఇప్పటికే పలు మండలా ల్లో కొనుగొలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 345 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తరలించి సహకరించాలి.

Updated Date - 2022-04-18T05:30:00+05:30 IST