మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-04-16T04:39:54+05:30 IST

చల్లవానితోట రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జేసీ కిషోర్‌కుమార్‌ గురువారం ప్రారంభించారు. కొప్పెర్ల, వెంపడాం, లంకలపల్లిపాలెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను స్థానిక అధికారులు ప్రారంభించారు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
పూసపాటిరేగ: మొక్కజొన్న పంటను పరిశీలిస్తున్న జేసీ, తదితరులు

పూసపాటిరేగ, ఏప్రిల్‌ 15: చల్లవానితోట రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జేసీ కిషోర్‌కుమార్‌ గురువారం ప్రారంభించారు. కొప్పెర్ల, వెంపడాం, లంకలపల్లిపాలెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను స్థానిక అధికారులు ప్రారంభించారు. ఈసందర్భంగా జేసీ పలు గ్రామాల్లో మొక్కజొన్న, పూసపాటిపాలెంలో వరి పంటను పరిశీలించారు. అక్కడ రైతులతో విత్తనాలు, ఎరువులు, వరి మద్దతు ధర, సంబంధిత సమస్యలపై రైతులతో చర్చించారు.  మొక్కజొన్న క్వింటాకు రూ.1,850 మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించింద న్నారు. రబీ సీజన్‌కు  రూ.38,400 టన్నులు కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు.  వ్యవసాయ సంయుక్త సంచాలకులు ఎం.ఆశాదేవి, మార్క్‌ఫెడ్‌ డీఎం షేక్‌ యాసిన్‌, సివిల్‌ సప్లయీస్‌ డీఎం భాస్కరరావు, ఏవో శ్రీనివాస్‌ పాల్గొన్నారు.   గజపతినగరం, : మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతులు వినియోగించు కోవాలని ఏవో సీహెచ్‌ ధనలక్ష్మి అన్నారు. తుమ్మికాపల్లిలో ఏర్పాటు చేసిన మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. సర్పంచ్‌ బెల్లాన త్రినాథరావు, మార్కెట్‌ కమిటీ సెక్రటరీ ఎన్‌. భువనేశ్వరి, రైతులు పాల్గొన్నారు.  పాచిపెంట: కేసలి ఆర్‌బీకే వద్ద  మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్నిప్రారంభించారు. పంటను 14 శాతం తేమ ఉండే విధంగా ఆరబెట్టాలని ఏవో బి.గోవిందరావు తెలిపారు.  మొక్క జొన్న కొనుగోలు చేసేందుకు తొమ్మిది ఆర్బీకే కేంద్రాలను ఎంపిక చేశామని తెలిపారు. వలంటీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.    మెరకముడిదాం :  సోమలింగాపురం పీఏసీఎస్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.  జిల్లా డీసీఎంఎస్‌ చెర్మన్‌ ఎస్‌వీ రమణరాజు, ఏవో జి.శ్రీనివాస్‌, ఎస్‌.సీతరామారాజు, బుధరాయివలస మాజీ సర్పంచ్‌  బంగారినాయుడు,  పీఏసీఎస్‌ సీఈవో వెంకటి తదితరులు పాల్గొన్నారు.    సీతానగరం:  సీతానగరం మండలం  పెదబోగిల రైతు భరోసా కేంద్రంలో  మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్‌  పి.చంద్రమౌళి ప్రారంభిం చారు. ఏవో ఎస్‌.అవినాష్‌ మాట్లాడుతూ.. పెదబోగిల, చినబోగిల, భూర్జ, గాదలవలస , లక్ష్మీపురం, బగ్గందరవలస, కొత్తవలస, తామరఖండి ఆర్‌బీకేల ద్వారా మొక్కజొన్న కొనుగోలుకు ఆన్‌లైన్‌ చేస్తున్నామన్నారు. ఆన్‌లైన్‌ చేసిన వెంటనే పెదబోగిల ఆర్‌బీకే వద్ద  పీఏసీఎస్‌ సెంటర్‌ ద్వారా వాటిని కొనుగోలు చేస్తామని చెప్పారు. మండ లంలో 102 హెక్టార్లలో మొక్కజొన్న వేశారన్నారు.  పీఏసీఎస్‌ ఇన్‌చార్జి  అలజంగి జార్జి, గ్రామ అగ్రికల్చర్‌ సహాయకులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-04-16T04:39:54+05:30 IST