దేశ పరిస్థితిపై 37 మంది నేతలకు స్టాలిన్ లేఖ

ABN , First Publish Date - 2022-02-03T02:06:08+05:30 IST

జాతీయ స్థాయిలో సమాఖ్యవిధానం, సామాజిక న్యాయ సూత్రాలను సాధించే దిశగా కృషి చేసేందుకు అన్ని పార్టీల నాయకులు, పౌర సమాజ సభ్యులు, భావసారూప్యత కలిగిన వ్యక్తులు, సంస్థలకు కలిసి ఉమ్మడి వేదికగా ఒక ఫెడరేషన్ తప్పనిసరిగా ఏర్పడింది. ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరిది..

దేశ పరిస్థితిపై 37 మంది నేతలకు స్టాలిన్ లేఖ

చెన్నై: మతోన్మాదుల గుప్పిట్లోకి వెళ్లి దేశం ప్రమాదంలో ఉందని, మతోన్మాదుల నుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉందంటూ దేశంలోని 37 మంది జాతీయ, ప్రాంతీయ నేతలకు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ లేఖ రాశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ‘ఆల్ ఇండియా సోషల్ జస్టిస్’ వేదికలో తమ పార్టీ నేతలను చేర్చుకోవాలంటూ తాను రాసిన లేఖలో స్టాలిన్ విజ్ణప్తి చేశారు.


సోనియా గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్, ఫారూఖ్ అబ్దుల్లా, శరద్ పవార్, మమతా బెనర్జీ, డీ.రాజా, సీతారం ఏచూరి, చంద్రబాబు నాయుడు, అరవింద్ కేజ్రీవాల్, మెహబూబా ముఫ్తీ, కేసీఆర్, ఉద్ధవ్ థాకరే, అఖిలేష్ యాదవ్‌లతో పాటు మరికొందరికి ఈ లేఖను పంపారు స్టాలిన్. వీరికే కాకుండా తమిళనాడులోని పార్టీల నేతలకు కూడా పంపారు. ఏఐడీఎంకే కోర్డినేటర్ పన్నీర్‌సెల్వం, పీఎంకే అధినేత రాందాస్, వీసీకే నేత థోల్ తిరుమవలన్‌లతో పాటు వైకోకి కూడా పంపారు.


‘‘జాతీయ స్థాయిలో సమాఖ్యవిధానం, సామాజిక న్యాయ సూత్రాలను సాధించే దిశగా కృషి చేసేందుకు అన్ని పార్టీల నాయకులు, పౌర సమాజ సభ్యులు, భావసారూప్యత కలిగిన వ్యక్తులు, సంస్థలకు కలిసి ఉమ్మడి వేదికగా ఒక ఫెడరేషన్ తప్పనిసరిగా ఏర్పడింది. ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరిది అనే సామాజిక న్యాయ భావజాలం చాలా అవసరం. ప్రతి ఒక్కరూ సమానమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక హక్కులు, అవకాశాలకు అర్హులని ఈ భావజాలంలో నమ్ముతాం. ఈ సమాన అవకాశాలను అందించిననాడే మన రాజ్యాంగ నిర్మాతల దృష్టిలోని సమానత్వ సమాజాన్ని నిర్మించగలము’’ అని లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు.

Updated Date - 2022-02-03T02:06:08+05:30 IST