Advertisement
Advertisement
Abn logo
Advertisement

ములకలచెరువులో నిలకడగా టమోటా ధరలు

భారీగా తగ్గిన దిగుబడి


పడిపోయిన ఎగుమతి 


ములకలచెరువు, డిసెంబరు 5:  స్థానిక మార్కెట్‌ యార్డులో టమోటా ధరలు నిలకడగా ఉన్నాయి. గత నాలుగు రోజులుగా 30 కిలోల బాక్సు రూ.1500 నుంచి రూ.1800 వరకు ధర పలుకుతోంది. ఈ క్రమంలో ఆదివారం 30 కిలోల బాక్సు రూ.1500 వరకు పలికింది. వరుస తుఫాన్ల కారణంగా టమోటా పంట భారీగా దెబ్బతిన్న విషయం విదితమే. ఈక్రమంలో దిగుబడి లేక మార్కెట్‌కు టమోటాలు విక్రయానికి రావడం భారీగా తగ్గిపోయింది. ఇక్కడి మార్కెట్‌నుంచి ప్రతి రోజు 25 లారీల టమోటాలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం ప్రతి రోజు 10 లారీల కాయలు కూడా ఎగుమతి కావడం లేదు. నిత్యం వాహనాలతో కిటకిటలాడే మార్కెట్‌ ప్రస్తుతం బోసిపోతోంది.

Advertisement
Advertisement