జోరుగా... ఎస్‌ఎస్‌ఎల్వీ అనుసంధాన పనులు

ABN , First Publish Date - 2022-08-04T06:37:14+05:30 IST

ఈ నెల 7వ తేదీ రోదసిలోకి ప్రయోగించనున్న ఇస్రో తొలి ఎస్‌ఎస్‌ఎల్వీ రాకెట్‌ అనుసంధాన పనులు షార్‌లో జోరుగా సాగుతున్నాయి.

జోరుగా... ఎస్‌ఎస్‌ఎల్వీ అనుసంధాన పనులు
వాహన అనుసంధాన భవనం వద్దకు ఎస్‌ఎస్‌ఎల్వీ తొలిదశ తరలింపు

 ఈ నెల 7వ తేదీ రోదసిలోకి ప్రయోగించనున్న ఇస్రో తొలి ఎస్‌ఎస్‌ఎల్వీ రాకెట్‌ అనుసంధాన పనులు షార్‌లో జోరుగా సాగుతున్నాయి. బుధవారానికి మూడు దశల అనుసంధానం షార్‌ వాహన అనుసంధాన భవనంలో పూర్తిచేశారు. ఇక ఉపగ్రహాలను ఉష్ణకవచంతో మూసివేసి నాల్గవ దశతో కలిపి రాకెట్‌ అగ్రభాగాన అమర్చాల్సి ఉంది.  4వ తేదీకి రాకెట్‌ అమరిక పూర్తిచేయనున్నారు. 5వ తేదీ  ప్రయోగ రిహార్సల్స్‌ జరపనున్నారు. 6వ తేదీ ఎంఆర్‌ఆర్‌, ల్యాబ్‌ సమావేశాలు నిర్వహించి అదే రోజురాత్రి కౌంట్‌డౌన్‌ ప్రారంభించి 8 గంటలపాటు కొనసాగించనున్నారు. కౌంట్‌డౌన్‌ ముగిసిన వెంటనే 7వ తేదీ ఉదయం 9.18 గంటలకు ఈ రాకెట్‌ భూపరిశీలన ఉపగ్రహం మైక్రోశాట్‌ 2ఎ, విద్యార్థినులు రూపొందించిన ఆజాదిశాట్‌తో రోదసిలోకి దూసుకుపోనుంది.









Updated Date - 2022-08-04T06:37:14+05:30 IST