వేడుకగా శ్రీవారి కల్యాణం

ABN , First Publish Date - 2022-05-18T05:30:00+05:30 IST

శ్రీదేవి, భూదేవి సమేత నారాపుర వేంకటేశ్వర స్వా మి వారి కల్యాణం వేడుకగా నిర్వహించారు. నారాపుర వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవంలో భా గంగా బుధవారం ఉదయం సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమి చ్చారు.

వేడుకగా శ్రీవారి కల్యాణం
శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణ దృశ్యం

సర్వభూపాల వాహనంపై వేంకటేశ్వర స్వామి 

నేడు రథోత్సవం

జమ్మలమడుగు రూరల్‌, మే 18: శ్రీదేవి, భూదేవి సమేత నారాపుర వేంకటేశ్వర స్వా మి వారి కల్యాణం వేడుకగా నిర్వహించారు. నారాపుర వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవంలో భా గంగా బుధవారం ఉదయం సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమి చ్చారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారిని  పట్టణంలో ఊరేగించారు. ఊరేగింపు వెళుతుండగా ప్రధాన రోడ్డుపై ఉన్న కరెంటు తీగలు కిందికి వంగి ఉండడంతో ఆలయ అధికారులు, సిబ్బంది వాటిని అడుగడుగునా తీగలను కర్రలతో పైకి ఎత్తడం, స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లారు.

రాత్రి ఎనిమిది గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి కల్యాణం నిర్వహించారు. స్వామి వారి వ స్ర్తాలు ఆలయ సూపరింటెండెంట్‌ వెంకటేశం తీసుకొచ్చారు. కల్యాణం వీక్షించేందుకు సు మారు వెయ్యిమందికి పైగానే భక్తులు వచ్చారు. ఆద్యంతం భక్తులు భక్తి శ్రద్ధలతో వేడును వీక్షించారు. గతంలో కరోనా నేపథ్యం లో రెండేళ్లగా ఏకాంతసేవలో సాగిన ఉత్సవా లు ఈ ఏడాది పెద్ద సంఖ్యలో భక్తుల నడు మ ఉత్సవాలు వేడుకగా సాగాయి. అనంత రం శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పా ట్లు చేసి గజవాహనంపై ఊరేగించారు. భక్తు లు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

నేడు రథోత్సవం

 గురువారం బ్రహ్మోత్సవంలో భాగంగా నారాపుర వేంకటేశ్వరస్వామి రథోత్సవం జరుగనుంది. ఇందుకు సంబందించి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణలో ఉన్న రథాన్ని సిద్ధం చేశారు. గురువారం ఉదయం ఆరు గంటల నుంచే ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఆలయ ప్రాంగణలో పారిశుధ్య చర్యలను సిబ్బంది చేపట్టారు. కమిషనర్‌ వెంకటరామిరెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నూర్‌బాష, సూపర్‌వైజర్లు ఆలయ ప్రాంగ ణం చుట్టూ ఎక్కడా వ్యర్థాలు లేకుండా శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు.

నేడు అన్నదానం

 బ్రహ్మోత్సవంలో భాగంగా గురువారం భక్తు ల ఆధ్వర్యంలో భారీ ఎత్తునఅన్నదానం చేప ట్టనున్నారు. స్థానిక పోలీసు స్టేషన్‌ వద్ద ప్రధానరోడ్డు పక్కన ఉదయం 11 గంటల నుంచి అన్నదానం చేపట్టనున్నారు. భక్తులు హాజరవాలని నిర్వాహకులు కోరారు. 



Updated Date - 2022-05-18T05:30:00+05:30 IST