మదర్‌ డెయిరీ చైర్మన్‌గా శ్రీకర్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-09-29T05:55:14+05:30 IST

నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్‌ లిమిటెడ్‌ (మ దర్‌ డెయిరీ) చైర్మన్‌గా లింగాల శ్రీకర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మదర్‌ డెయిరీ చైర్మన్‌గా శ్రీకర్‌రెడ్డి
మదర్‌ డెయిరీ నూతన చైర్మన్‌ శ్రీకర్‌రెడ్డిని అభినందిస్తున్న మంత్రి జగదీ్‌షరెడ్డి

సీల్డ్‌ కవర్‌లో పేరును సూచించిన అధిష్ఠానం 

మంత్రి జగదీ్‌షరెడ్డి సమక్షంలో ఏకగ్రీవ ఎన్నిక


నల్లగొండ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్‌ లిమిటెడ్‌ (మ దర్‌ డెయిరీ) చైర్మన్‌గా లింగాల శ్రీకర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో మదర్‌ డెయిరీ కార్యాలయంలో జరిగిన ఈ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. విద్యుత్‌ శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ఎన్నికల కార్యక్రమంలో మొత్తం 15 మంది డైరెక్టర్లు పాల్గొని చైర్మన్‌ను ఎన్నుకున్నారు. మంగళవారం టీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు కొత్త డైరెక్టర్లు భారీ మెజార్టీతో గెలిచిన అనంతరం బుధవారం మంత్రి జగదీ్‌షరెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతి భవన్‌కు వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా పార్టీ అధిష్ఠానం, మంత్రి జగదీ్‌షరెడ్డికి సీల్డ్‌ కవర్‌ను అందజేసింది. మంత్రి ఆసీల్డ్‌ కవర్‌ను ఎన్నిక లు జరిగే కార్యాలయం వద్దకు తీసుకొచ్చి డైరెక్టర్లు, ఎన్నికల అధికారుల సమక్షంలో తెరిచి లింగాల శ్రీకర్‌రెడ్డిని చైర్మన్‌గా ప్రకటించారు. దీంతో డైరెక్టర్లంతా అధిష్ఠానం సూచనమేరకు ఏకగ్రీవంగా ఆమోదించారు. మోటకొండూరు మండలం దిలావర్‌పూర్‌ గ్రామానికి చెందిన లింగాల శ్రీకర్‌రెడ్డి స్థానికంగా తొమ్మిదేళ్లుగా పాల సంఘం చైర్మన్‌గా కొనసాగడంతోపాటు 8 సంవత్సరాలుగా మదర్‌డెయిరీ డైరెక్టర్‌గా కొనసాగుతూ వస్తున్నారు. దీనికి తోడు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డిలతో లింగాల శ్రీకర్‌రెడ్డి మలిదశ తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశారు. దీనికితోడు ఆలేరు నియోజకవర్గం లో వివాదరహితుడుగా ఉంటూ అందరితో కలిసి పనిచేస్తూ పార్టీ బలోపేతంకోసం పనిచేస్తున్నారు. మొదటి నుంచి డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి ఆలేరు నియోజకవర్గానికే ఈసారిమదర్‌ డెయిరీ చైర్మన్‌ పద వి ఇవ్వాలని కోరుతూ వస్తున్న విషయం తెలిసిందే. పాల సంఘాలు అధికంగా ఉండడంతోపాటు పాల ఉత్పత్తి కూడా ఆలేరు నియోజకవర్గంలో అధికంగా ఉండడంతోపాటు జిల్లాలో అత్యధికంగా పాల సం ఘాలున్నాయి. ఈనేపథ్యంలో గొంగిడి మహేందర్‌రెడ్డి ఆలేరు నియోజకవర్గానికి మదర్‌ డెయిరీ చైర్మన్‌ పద వి ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను, మంత్రి జగదీ్‌షరెడ్డిని పలుమార్లు కోరిన నేపథ్యంలో ఈసారి ఎట్టకేలకు ఆలే రు నియోజకవర్గానికి చెందిన లింగాల శ్రీకర్‌రెడ్డిని మ దర్‌ డెయిరీ చైర్మన్‌ పదవి వరించింది. ఇక 20 సంవత్సరాలుగా డైరెక్టర్‌గా ఉండి కేవలం సంవత్సరంపాటే చైర్మన్‌గా కొనసాగిన గంగుల కృష్ణారెడ్డికి భవిష్యత్‌లో మంచి పదవి కట్టబెట్టేందుకు అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా మంత్రి జగదీ్‌షరెడ్డి మాట్లాడుతూ మదర్‌డెయిరీని అభివృద్ధిపధంలోకి తీసుకొచ్చేందుకు కొత్త చైర్మన్‌తోపాటు పాలకవర్గ స భ్యులు కృషి చేయాలన్నారు. ప్రైవేటు డెయిరీలకు పో టీగా మదర్‌ డెయిరీని ముందుకు తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-29T05:55:14+05:30 IST