Advertisement
Advertisement
Abn logo
Advertisement

పలాసలో యాదవ కుల నాయకుల గృహనిర్బంధం

శ్రీకాకుళం: జిల్లాలోని పలాసలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. యాదవ కులాల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తున్న నేపథ్యంలో యాదవ్ కుల నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. రాష్ట్ర యాదవ కుల అధ్యక్షుడు  గురయ్య  పలాసకు చేరుకున్నారు. కాగా యాదవ కుల ర్యాలీని అడ్డుకునేందుకు గురయ్యను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గురయ్యతో పాటు యాదవ కుల నాయకులను కాశీబుగ్గ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. యాదవ కులాన్ని కించపరిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగులపై రాష్ట్ర యాదవ మహాసభ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement