శ్రీరామకృష్ణ విద్యానికేతన్ హైస్కూల్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
ABN , First Publish Date - 2022-03-09T00:55:56+05:30 IST
నిజామాబాద్: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌లోని శ్రీరామకృష్ణ విద్యానికేతన్ హైస్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
నిజామాబాద్: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌లోని శ్రీరామకృష్ణ విద్యానికేతన్ హైస్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల ప్రాధాన్యతను తెలియజేస్తూ విద్యార్ధినులు చేసిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఉమెన్స్ డే సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో శ్రీరామకృష్ణ విద్యానికేతన్ హైస్కూల్‌కు చెందిన సముద్రాల శశిరేఖ, సముద్రాల మాధురి, శ్రీనివాసాచార్యులు, మధుసూదనాచార్యులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.