కరోనా ఎఫెక్ట్: ముస్లిం వ్యక్తి మృతదేహం దహనంపై వివాదం

ABN , First Publish Date - 2020-04-04T18:22:47+05:30 IST

శ్రీలంకలో కరోనా వైరస్ సోకిన ముస్లిం వ్యక్తి మృతదేహాన్ని దహనం చేసిన నేపధ్యంలో మైనారిటీ వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక్కడి ఉన్నతాధికారులు...

కరోనా ఎఫెక్ట్: ముస్లిం వ్యక్తి మృతదేహం దహనంపై వివాదం

 కొలంబో: శ్రీలంకలో కరోనా వైరస్ సోకిన ముస్లిం వ్యక్తి మృతదేహాన్ని  దహనం చేసిన నేపధ్యంలో మైనారిటీ వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక్కడి ఉన్నతాధికారులు ఇస్లాంలో సూచించిన ఖనన కర్మల అమలుకు అడ్డువస్తున్నారని  వారు ఆరోపిస్తున్నారు. కొలంబోలో 73 ఏళ్ల బిష్రఫ్ హఫీ మొహమ్మద్ కరోనా వైరస్ కారణంగా మరణించారు. ఈ నేపథ్యంలో అతని మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. అయితే  ఇస్లామిక్ సంప్రదాయంలో దహన సంస్కారాలు నిర్వహించరు. మృతదేహాన్ని ఖననం చేస్తారు. కాగా మృతుని కుమారుడు ఫయాజ్ జూనస్ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్లు పేర్కొన్నాడు. రెండు వారాల క్రితం కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిన తరువాత ఏప్రిల్ 1 న మరణించాడన్నారు. తన తండ్రి మృతదేహాన్ని పోలీసు బలగాల పర్యవేక్షణలో, వాహనంలో తీసుకెళ్లి దహనం చేశారన్నారు. దూరంగా తాము నిలబడి వారి ఆత్మ శాంతి కోసం ప్రార్ధించామన్నారు. ఇది ముస్లిముల సంప్రదాయం కాదన్నారు. 


Updated Date - 2020-04-04T18:22:47+05:30 IST