వైభవంగా శ్రీకృష్ణాష్టమి

ABN , First Publish Date - 2022-08-20T06:21:02+05:30 IST

జిల్లావ్యాప్తంగా శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమిని అంగరంగ వైభవంగా జరుకున్నారు.

వైభవంగా శ్రీకృష్ణాష్టమి
ఇస్కాన్‌ మందిరంలో పూజలందుకున్న రాధాకృష్ణులు

జిల్లావ్యాప్తంగా శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమిని అంగరంగ వైభవంగా జరుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. వాడవాడలా నిర్వహించిన ఉట్టి సంబరాల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ పాఠశాలల చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించారు. సాగర్‌నగర్‌లోని ఇస్కాన్‌ మందిరంలో స్వామికి 56 రకాల పిండివంటలతో నైవేద్యం సమర్పించారు. అర్ధరాత్రి 12 గంటలకు 1008 దీపాలతో హారతి ఇచ్చారు. 


కన్యకాపరమేశ్వరికి లక్ష గాజుల అలంకరణ

వన్‌టౌన్‌లోని కన్యకాపరమేశ్వరి అమ్మవారు లక్ష గాజులు, ముత్యాల వస్త్రాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి 108 రకాల సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గాజులతో అలంకరించారు. మహిళలు సామూహిక లలితా సహస్ర నామ పారాయణం, శ్రీచక్ర సహిత కుంకుమ పూజలు చేశారు. 

- మహారాణిపేట 



Updated Date - 2022-08-20T06:21:02+05:30 IST