క్రీడలు జీవితంలో భాగం కావాలి

ABN , First Publish Date - 2022-08-19T04:44:25+05:30 IST

క్రీడలు ప్రతీ వ్యక్తి జీవితంలో భాగంగా కావాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. జిల్లా స్థాయి ప్రీడం కప్‌ క్రీడలను గురువారం శ్రీరాంపూర్‌లోని ప్రగతి స్టేడియంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

క్రీడలు జీవితంలో భాగం కావాలి
క్రికెట్‌ ఆడుతున్న జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరి

- జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరి

శ్రీరాంపూర్‌, ఆగస్టు  18 : క్రీడలు  ప్రతీ వ్యక్తి జీవితంలో భాగంగా కావాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. జిల్లా స్థాయి ప్రీడం కప్‌ క్రీడలను గురువారం శ్రీరాంపూర్‌లోని ప్రగతి స్టేడియంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.  జ్యోతి ప్రజ్వలన అనంతరం మాట్లాడుతూ కలెక ్టర్‌ మాట్లాడారు. జిల్లాలోని  18 మండలాలకు చెందిన క్రీడాకారులు ఇందులో పాలుపంచుకుంటున్నట్లు తెలిపారు. క్రీడల  కమిటీ చైర్మన్‌, డీసీపీ అడ్మిన్‌ అఖిల్‌ మహాజన్‌ మాట్లాడుతూ ఈ క్రీడలను గ్రామీణ స్థాయి నుంచి ప్రారంభించి  మండల, జిల్లా  స్థాయిలో నిర్వహిస్తున్నామని చెప్పారు. క్రీడలు ప్రారంభానికి ముందు వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.  కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఈసంపెల్లి ప్రభాకర్‌, వైస్‌ చైర్మన్‌ తోట శ్రీనివాస్‌, ఆర్డీవో వేణు, టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, నాయకుడు డీకొండ అన్నయ్య, కార్యక్రమ నిర్వాహకులు రాంచందర్‌, అశోక్‌, వివిధ పాఠశాలల నిర్వాహకులు ఉపేందర్‌, బత్తిని దేవయ్య,  జైపూర్‌ ఏసీపీ నరేందర్‌,  మంచిర్యాల ఏసీపీ తిరుపతిరెడ్డి, జిల్లా క్రీడా యువజన శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు కుమార్‌, సిడం మహేష్‌, వంగ తిరుపతి, ప్రకాష్‌రెడ్డి, శ్రీరాంపూర్‌,  మంచిర్యాల రూరల్‌ సీఐలు రాజు, సంజీవ్‌, ఆర్డీవో వేణు తదితరులు పాల్గొన్నారు. 

- క్రీడా పోటీల విజేతలు వీరే  

 క్రికెట్‌ మొదటి స్థానంలో పోలీసు శాఖ, రెండో స్థానంలో రెవెన్యూ శాఖ నిలిచింది. ఇందులో బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌గా ఉదయ్‌,  ఉత్తమ కీపర్‌గా కుమారస్వామి ఎంపికయ్యారు. లాంగ్‌ జంప్‌ పురుషుల విభాగంలో  ఎన్‌ నరేష్‌ మొదటి స్థానంలో నిలవగా బి గణేశ్‌ రెండో స్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో లలితా మొదటి స్థానంలో,  రాణి రెండో స్థానంలో నిలిచింది. వంద మీటర్ల మహిళల విభాగంలో పి కృష్ణవేణి మొదటి స్థానం, బి బతుకక్క రెండో స్థానంలో నిలిచింది. పురుషుల విభాగంలో మొదటి స్థానంలో సోహన్‌ కుమార్‌, రెండో స్థానంలో యు ప్రేంచంద్‌ నిలిచాడు. ఉద్యోగుల వంద మీటర్ల మహిళల విభాగంలో స్రవంతి మొదటి స్థానం, జ్యోతి  రెండో స్థానం, పురుషుల విభాగంలో అమిత్‌ మొదటి స్థానం, నాగేశ్వర్‌ రెండో స్థానంలో నిలిచారు. కోకో అంశంలో మహిళా విభాగంలో వేమనపల్లి జట్టు మొదటి స్థానం, మందమర్రి జట్టు  రెండో స్థానం, కోకో పురుషుల విభాగంలో జైపూర్‌ మొదటి, వేమనపల్లి రెండో స్థానంలో నిలిచింది. క్యారమ్స్‌ డబుల్స్‌లో పి సమ్మయ్య, ఆర్‌ రాజశేఖర్‌ మొదటి స్థానంలో నిలవగా బి రమేష్‌, ఏ సుధాకర్‌గౌడ్‌ రెండో స్థానంలో నిలిచారు. టగ్‌ ఆఫ్‌ వార్‌ పురుషుల విభాగంలో శ్రీహరి జట్టు మొదటి స్థానంలో నిలిచింది. చెస్‌లో రామకృష్ణ మొదటి స్థానంలో నిలవగా సమ్మయ్య రెండో స్థానంలో నిలిచారు. యూత్‌ చెస్‌ అంశంలో సాకేత్‌ నందన్‌ మొదటి, ఎన్‌ మహేష్‌ రెండో స్థానంలో నిలవగా ఎన్‌ వినయ్‌, ఎస్‌ మల్లేషంకు కన్నోలేషన్‌ బహుమతులు అందాయి. బ్యాట్మెంటన్‌ డబుల్స్‌ విభాగంలో మహేష్‌, రవిగౌడ్‌ మొదటి స్థానం, జగదీష్‌, సంతోష్‌ రెండో స్థానం, బ్యాట్మెంటన్‌ మిక్స్డ్‌ డబులో  హోళ్లికేరి, రవికుమార్‌ మొదటి స్థానం, భరత్‌, వెంకటరమణ రెండో స్థానంలో నిలిచారు.  200 మీటర్స్‌ రన్నింగ్‌లో బతుకక్క మొదటి స్థానం, కృష్ణవేణి  రెండో స్థానం, పురుషుల విభాగంలో సోహన్‌ కుమార్‌ మొదటి స్థానం, కే వాసు రెండో స్థానం, టగ్‌ ఆఫ్‌ వార్‌ ఎంప్లాయిస్‌ విభాగంలో రెవెన్యూ మహిళల విభాగం విజయం సాధించింది. యూత్‌ పురుషుల టగ్‌ ఆఫ్‌ వార్‌ అంశంలో నెన్నెల రెండో స్థానం, కాసిపేట మొదటి స్థానం, యూత్‌ కబడ్డి అంశంలో జైపూర్‌ మొదటి, నస్పూర్‌ రెండో స్థానంలో నిలిచాయి.  ఈ మేరకు కలెక్టర్‌ భారతి హోళికేరి, క్రీడల  కమిటీ చైర్మన్‌, డీసీపీ అడ్మిన్‌ అఖిల్‌ మహాజన్‌ బహుమతులు అందజేశారు.

Updated Date - 2022-08-19T04:44:25+05:30 IST