క్రీడా ప్రాంగణాలను వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2022-08-19T05:41:12+05:30 IST

క్రీడా ప్రాంగణాలను వినియోగించుకోవాలి

క్రీడా ప్రాంగణాలను వినియోగించుకోవాలి
చేవెళ్ల: బహుమతులు అందజేస్తున్న ఎమ్మెల్యే యాదయ్య

  • చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య 


చేవెళ్ల/మొయినాబాద్‌ రూరల్‌/షాబాద్‌/యాచారం/మంచాల/కడ్తాల్‌/  ఇబ్రహీంపట్నం, ఆగస్టు 18: క్రీడా ప్రాంగణాలను వినియోగించుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. వజ్రోత్సల్లో భాగంగా గురువారం చేవెళ్ల పరిధి పామెనలో నిర్వహించిన ఫ్రీడమ్‌ పోటీలను ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌ తదితర పోటీలను నిర్వహించగా విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. ఆర్డీవో వేణుమాదవరావు, ఎంపీడీవో రాజ్‌కుమార్‌, ఎంపీవో విఠలేశ్వర్‌, పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్‌, సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణారెడ్డి, సర్పంచ్‌ మల్లారెడ్డి ఉన్నారు. అదేవిధంగా మొయినాబాద్‌ మండలం హిమాయత్‌నగర్‌ రెవెన్యూలోని ఓ క్రీడామైదానంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కబడ్డీ, క్రికెట్‌, రింగ్‌ పోటీలను నిర్వహించారు. సంస్థ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్త పాల్గొని పోటీలను ప్రారంభించారు. తెలంగాణ హరిత హోటల్‌ ఎండీ కే.నాథన్‌, శాంతి, నర్సింహారావు, రవీందర్‌ నాయక్‌, అంజిరెడ్డి, ఇబ్రహీం, లక్ష్యరావు, ఓంప్రకాష్‌, రాజేశ్వర్‌, మహేష్‌ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా షాబాద్‌ మండల కేంద్రంలో క్రికెట్‌, వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు. పోలీ్‌ససిబ్బంది మొదటి బహుమతి అందుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో అనురాధ, డిప్యూటీ తహసీల్దార్‌ క్రాంతికుమార్‌, సర్పంచ్‌ సుబ్రహ్మణ్యేశ్వరీ, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా యాచారంలో నిర్వహించిన పోటీల్లో విజేతలకు ఎంపీపీ కొప్పు సుకన్యబాషా, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ ఎంపీడీవో విజయలక్ష్మి,  తహసీల్దార్‌ సుచరితలు బహుమతులు అందజేశారు. అదేవిధంగా మంచాలలో నిర్వహించిన ఫ్రీడమ్‌ పోటీల్లో ఎంపీపీ జాటోత్‌నర్మద, తహసీల్దార్‌ అనిత, ఎంపీడీవో శ్రీనివాస్‌, సీఐ వెంకటేశ్‌, సర్పంచులు జగన్‌రెడ్డి, రాజూనాయక్‌, ఎంఈవో వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా కడ్తాలలో జడ్పీటీసీ జర్పుల దశరథ్‌ నాయక్‌, ఆమనగల్లు పీఏసీఎస్‌ చైర్మన్‌ గంప వెంకటేశ్‌లు ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీవో మదుసూఽధానాచారి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జోగు వీరయ్యలతో కలిసి పోటీలను ప్రారంభించారు. క్రికెట్‌లో ఎంపీడీవో టీం, వాలీబాల్‌లో ఎంపీవో టీంలు గెలుపొందాయి. ఎంపీటీసీ లచ్చిరామ్‌ నాయక్‌, సర్పంచ్‌ నాగమణివెంకోబా, ఉపసర్పంచ్‌ కడారి రామకృష్ణ, వెంకటేశ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం మండల పరిషత్‌ కార్యాలయంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్బంగా నిర్వహించిన క్రీడల్లో విజేతలకు గురువారం బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్‌, ఎంపీడీవో జయరాం విజయ్‌, తహసీల్దార్‌ రామ్మోహన్‌, ఎంఈవో వెంకట్‌రెడ్డి, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు పరమేశ్‌ ఉన్నారు. 

Updated Date - 2022-08-19T05:41:12+05:30 IST