పాలకూర... ప్రయోజనం తెలుసా!

ABN , First Publish Date - 2020-06-23T05:30:00+05:30 IST

చాలామంది పిల్లలు పాలకూరంటే తినడానికి ఇష్టపడరు. కానీ అందులో ఉండే పోషకాల గురించి తెలిస్తే ఈసారి మమ్మీని అడిగి మరీ వండించుకుని తింటారు. మరి పాలకూరలో ఉండే పోషకాలు ఏవో తెలుసుకుందామా...

పాలకూర... ప్రయోజనం తెలుసా!

చాలామంది పిల్లలు పాలకూరంటే తినడానికి ఇష్టపడరు. కానీ అందులో ఉండే పోషకాల గురించి తెలిస్తే ఈసారి మమ్మీని అడిగి మరీ వండించుకుని తింటారు. మరి పాలకూరలో ఉండే పోషకాలు ఏవో తెలుసుకుందామా!


  1. పాలకూరలో విటమిన్‌-కె ఉంటుంది. ఇది ఎముకలు దృఢంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్‌-డి, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్‌-సి ఉంటాయి. ఇవన్నీ ఎముకల దృఢత్వానికి ఉపయోగపడేవే.
  2. ఈ ఆకుకూరలో బీటా కెరోటిన్‌, ల్యూటిన్‌, క్లోరోఫిల్‌-2 ఉంటాయి. ఇవి కంటిచూపును కాపాడుతాయి. రోగనిరోధకశక్తిని పెంచుతాయి. అందుకే పిల్లలు తప్పనిసరిగా పాలకూర తినాలి.
  3. ఇందులో విటమిన్‌-ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన సీబమ్‌ ఉత్పత్తిలో తోడ్పడుతుంది. బ్యాక్టీరియా, వైర్‌సలపై సమర్థంగా పోరాడటానికి చర్మానికి, మ్యూకస్‌ మెంబ్రేన్‌కు సహాయపడుతుంది.
  4. ఇందులో ఉండే ల్యూటిన్‌ రక్తనాళాల గోడలు గట్టిపడడాన్ని నిరోధిస్తుంది. ఫలితంగా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. 
  5. రోజంతా శక్తిమంతంగా ఉండేందుకు పాలకూరలో ఉండే ఫోలేట్‌ ఉపకరిస్తుంది.

  • పిల్లలూ.. తెలిసింది కదా! పాలకూర తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో! 

Updated Date - 2020-06-23T05:30:00+05:30 IST