డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2020-11-29T06:25:54+05:30 IST

జిల్లాలో గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో చేపట్టి రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ముషార ఫ్‌ ఫారూఖీ అధికారులను ఆదేశించారు.

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

నిర్మల్‌ టౌన్‌, నవంబరు 28 : జిల్లాలో గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో చేపట్టి రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ముషార ఫ్‌ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొ న్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో చేపట్టిన రెండు పడక గదుల ఇండ్లనిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. పరిపాలన అనుమతులు పొందిన వాటికి స్థలాలను గుర్తించి, టెండర్‌ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్లఓ నమోదు చేయాలన్నారు. ఇప్పటికే పూర్తయిన రెండు పడక గదుల ఇండ్ల కాలనీలలో మిషన్‌ భగీరథ తాగునీరు, విద్యుత్‌ సరఫరా, రోడ్లు, మురికి కాలువల నిర్మాణాల పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, జిల్లా ఇన్‌చార్జీ రెవెన్యూ అధికారి రాథోడ్‌రమేష్‌, రెండుపడక గదుల ఇండ్ల  జిల్లా నోడల్‌ అధికారి సత్య నారాయణ, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, పంచాయతీరాజ్‌శాఖ ఈఈ శంకరయ్య, రోడ్డు భవనాల శాఖ ఈఈ అశోక్‌ కుమార్‌, విద్యుత్‌శాఖ డీఈ మధుసూదన్‌, నిర్మల్‌, భైంసా మున్సిపల్‌ కమిషనర్లు బాలకృష్ణ, ఖాదీర్‌, కలెక్టర్‌ కార్యాలయ పర్యవేక్షకులు రహీమ్‌ ఉద్దీన్‌, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-29T06:25:54+05:30 IST