ఓటీఎ్‌సను వేగవంతం చేయండి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-01-18T06:04:04+05:30 IST

జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం కింద చేపట్టిన ఓటీఎ్‌సను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన.. సంబందిత అధికారులను ఆదేశించారు.

ఓటీఎ్‌సను వేగవంతం చేయండి: కలెక్టర్‌
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన

అనంతపురం, జనవరి17 (ఆంధ్రజ్యోతి): జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం కింద చేపట్టిన ఓటీఎ్‌సను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన.. సంబందిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స హాల్‌లో జేసీలు నిశాంతకుమార్‌, సిరి, గంగాధర్‌ గౌడ్‌తో కలిసి ఓటీఎస్‌, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు, కొవిడ్‌, స్పందన తదతర కార్యక్రమాలపై ఆమె వీడియో కాన్ఫరెన్స ని ర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఓటీఎస్‌, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కింద ఇళ్ల గ్రౌండింగ్‌కు అత్యధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 1.60 లక్షల మంది లబ్ధిదారుల సర్వే వారం రోజుల్లోపు పూర్తి చే యాలన్నారు. వచ్చే వారంలో ఓటీఎస్‌ మెగామేళా నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో లబ్ధిదారుల గుర్తింపు, డేటాఎంట్రీ కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు. ఇందుకు సంబందిం చి రోజూ రిపోర్టులు అందజేయాలన్నారు. కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. జిల్లాలోని నియోజకవర్గానికి ఒక కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. హోంఐసోలేషనలో ఉన్న వారిని నిత్యం మానిటర్‌ చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 2.20 లక్షల మందికి రెండో డోస్‌ వ్యాక్సినేషన పూర్తి చేయాలన్నారు. వీ డియో కాన్ఫరెన్సలో పెనుకొండ సబ్‌కలెక్టర్‌ నవీన, హౌసింగ్‌ పీడీ కేశవనాయుడు, జడ్పీ సీఈఓ భాస్కర్‌ రెడ్డి, డ్వామా పీడీ వేణుగోపాల్‌ రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి, మె ప్మా పీడీ విజయలక్ష్మి, డీఎంహెచఓ కామేశ్వరప్రసాద్‌, డీసీహెచఎ్‌స రమే్‌షనాథ్‌, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ నీరజ, వ్య వసాయశాఖ జేడీ చంద్రానాయక్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ వెంకటరమణ, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ భాగ్యరాజ్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ శ్రీనాథ్‌రెడ్డి, బీసీ కార్పొరేషన ఈడీ నాగముని, సిరికల్చర్‌ డీడీ శాంతి, ఆర్డీఓలు, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-18T06:04:04+05:30 IST