ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రత్యేక వైద్య సేవలు

ABN , First Publish Date - 2020-04-04T11:39:59+05:30 IST

ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రి, ఆశ్రం ఆస్పత్రులను కరోనా కేసుల నిమిత్తం కొవిడ్‌ ఆస్పత్రులుగా మార్చిన దృష్ట్యా రోగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రత్యేక వైద్య సేవలు

ఆరోగ్యశ్రీ ద్వారా అత్యవసర వైద్యం

ఆస్పత్రుల జాబితా విడుదల  


ఏలూరు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 3 : ఏలూరులోని జిల్లా కేంద్ర  ప్రభుత్వాస్పత్రి, ఆశ్రం ఆస్పత్రులను కరోనా కేసుల నిమిత్తం కొవిడ్‌ ఆస్పత్రులుగా మార్చిన దృష్ట్యా రోగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. నిత్యం ఈ రెండు ఆస్పత్రులకు జిల్లా నలుమూలల నుంచి వేల సంఖ్యలో రోగులు వస్తుంటారు.  అన్ని విభాగాల డాక్టర్లను కొవిడ్‌ రోగులకు చికిత్స నిమిత్తం ప్రత్యేకించిన దృష్ట్యా ఈ రెండు ఆస్పత్రుల్లో యాక్సిడెంట్‌ కేసులను, ఎమర్జెన్సీ కేసులను, ప్రసూతి సేవలను నిలిపివేస్తున్నట్టు కలెక్టర్‌ ముత్యాలరాజు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుబ్రహ్మ ణ్యేశ్వరి తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలకు అత్యవసర సేవల నిమిత్తం సమీపంలోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తిగా ఉచితంగా వైద్యసేవలు అందుతాయన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోని ప్రసూతి విభాగానికి సంబంధించిన ఆస్పత్రులు, ఇతర విభాగాలకు సంబంధించిన వివరాలతో కూడిన జాబితాను  విడుదల చేశారు.


ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని కేసులను తణుకు, తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రుల్లో చూస్తారని తెలిపారు. మరింత సమాచారం కోసం హెల్ప్‌లైన్‌ నెంబరు 104, జిల్లా కోఆర్డినేటర్‌ ఫోన్‌ నెంబరు 83338 14023లో లేదా ఆస్పత్రుల్లోని ఆరోగ్యమిత్రలను సంప్రదిం చాలన్నారు. డయాలసిస్‌ రోగుల కోసం తాడేపల్లిగూడెం, తణుకు, జంగా రెడ్డిగూడెంలలోని ప్రైవేటు ఆస్పత్రులు, భీమవరంలోని వర్మ ఆస్పత్రి, ఏలూ రులోని చైత్ర ఆస్పత్రుల్లో చికిత్సను ప్రత్యేకించామన్నారు. డయాలసిస్‌ రోగులకు చికిత్స నిమిత్తం ఎవరెవరు ఎక్కడికి, ఏ సమయానికి వెళ్లాలో వ్యక్తిగతంగా ఫోన్ల ద్వారా సమాచారం తెలియజేస్తామని ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రాజేశ్‌ వివరించారు. 


ఆయా వైద్య సేవలకు జిల్లాలో ప్రత్యేకించిన ఆసుపత్రులు ఇవే..

జనరల్‌ సర్జరీ కేసులకు ఏలూరు భువనేశ్వరి ఆస్పత్రి, చైత్ర హాస్పిటల్‌, గుడ్‌ సమరిటన్‌ కేన్సర్‌ ఆస్పత్రి, మురళీకృష్ణ ఆస్పత్రి, ప్రభ ఆస్పత్రి, విజయ ఆస్పత్రి, తాడేపల్లిగూడెంలోని మదర్‌ వన్నిని ఆస్పత్రి, ప్రణవి నర్సింగ్‌ హోమ్‌, తణుకులోని సాయిశ్వేత ఆస్పత్రి, యాపిల్‌ ఆస్పత్రి, శ్రీసాయి ఆస్పత్రి, సుధ ఆస్పత్రి. భీమవరంలోని మధు చలపతి యురో లాజికల్‌ ఆస్పత్రి, శ్రీలక్ష్మీ ఆస్పత్రి, వర్మ ఆస్పత్రి. పాలకొల్లులోని శ్రీసూర్య నర్సింగ్‌ హోమ్‌, జంగారెడ్డిగూడెంలోని వడ్లమూడి ఆస్పత్రి, పీవీఆర్‌ ఆస్పత్రి, సాయి స్ఫూర్తి ఆస్పత్రి. 


ఈఎన్‌టీ సర్జరీలకు ఏలూరు చైత్ర హాస్పిటల్‌, తణుకు యాపిల్‌ ఆస్ప త్రి, సాయిశ్వేత ఆస్పత్రి, శ్రీసాయి ఆస్పత్రి. భీమవరంలోని మధుచలపతి ఆస్పత్రి. పాలకొల్లులోని శ్రీసూర్యనర్సింగ్‌ హోమ్‌. జంగారెడ్డిగూడెంలోని సాయిస్ఫూర్తి మల్టీస్పెషాల్టీ  ఆస్పత్రి, వడ్లమూడి ఆస్పత్రి. 


ఆప్తమాలజీ వైద్యసేవలకు జానకీ ఆస్పత్రి, జంగారెడ్డిగూడెంలోని సాయిస్ఫూర్తి ఆస్పత్రి, ఏలూరులోని విజయ ఆస్పత్రి. 


గైనకాలజీ, ఓబెస్ర్టిక్స్‌ సర్జరీలకు ఏలూరులోని భువనేశ్వరి ఆస్పత్రి, చైత్ర ఆస్పత్రి, మురళీకృష్ణ  ఆస్పత్రి, విజయ ఆస్పత్రి. జంగారెడ్డిగూడెంలోని వడ్లమూడి ఆస్పత్రి, సాయిస్ఫూర్తి ఆస్పత్రి. తణుకులోని యాపిల్‌ ఆస్ప త్రి, సుధ ఆస్పత్రి, శ్రీసాయి హాస్పిటల్‌, సాయిశ్వేత ఆస్పత్రి. తాడే పల్లిగూడెం మదర్‌ వన్నిని నర్సింగ్‌ హోమ్‌, ప్రణవి నర్సింగ్‌ హోమ్‌, భీమవరంలోని వర్మ ఆస్పత్రి, శ్రీలక్ష్మీ ఆస్పత్రి, పాలకొల్లులోని శ్రీసూర్య నర్సింగ్‌ హోమ్‌, తాళ్ళపూడిలోని శ్రీసాయిస్ఫూర్తి  ఆస్పత్రి. 


ఆర్థోపెడిక్‌ సర్జరీలు, ప్రొసిజర్లకు ఏలూరులోని భువనేశ్వరి ఆస్పత్రి, చైత్ర ఆస్పత్రి, మురళీ ఎమర్జెన్సీ ఆస్పత్రి, ప్రభ ఆస్పత్రి, విజయ ఆస్పత్రి. ద్వారకాతిరుమలలోని విర్డ్స్‌ ఆస్పత్రి. తాడేపల్లిగూడెంలో మదర్‌ వన్నిని ఆస్పత్రి, ప్రణవి నర్సింగ్‌ హోమ్‌, తణుకులోని యాపిల్‌ ఆస్పత్రి, సాయి శ్వేత ఆస్పత్రి, శ్రీసాయి ఆస్పత్రి, సుధ ఆస్పత్రి, నిడదవోలుని శేషగిరి ఆస్పత్రి. భీమవరంలోని అవినాశ్‌ ట్రామా ఆస్పత్రి, మధు చలపతి ఆస్ప త్రి, శ్రీలక్ష్మీ ఆస్పత్రి, వర్మ ఆస్పత్రి. పాలకొల్లులోని శ్రీసూర్యనర్సింగ్‌ హోమ్‌. నరసాపురంలోని శ్రీసూర్య ఆస్పత్రి. జానకీ ఆస్పత్రి . జంగారెడ్డిగూడెంలో వడ్లమూడి ఆస్పత్రి, పీవీఆర్‌  ఆస్పత్రి, సాయిస్ఫూర్తి ఆస్పత్రి. 


సర్జికల్‌ గ్యాస్ర్టో ఎంట్రాలజి వైద్యసేవలకు తణుకులోని సుధ ఆస్పత్రి. 


కార్డియాక్‌, కార్డియో సర్జరీ సేవలకు తణుకులోని యాపిల్‌ ఆస్పత్రి, భీమవరం ఆస్పత్రి. 


పీడీయాట్రిక్‌ సర్జరీలకు తణుకులోని యాపిల్‌ ఆస్పత్రి, భీమవరంలోని వర్మ ఆస్పత్రి, తాళ్లపూడిలోని శ్రీసాయిస్ఫూర్తి ఆస్పత్రి, జంగారెడ్డి గూడెంలో పీవీఆర్‌ ఆస్పత్రి, సాయిస్ఫూర్తి ఆస్పత్రి, వడ్లమూడి ఆస్పత్రి. 


జనిటో యూరినరీ సర్జరీలకు ఏలూరులోని భువనేశ్వరి హాస్పిటల్‌, చైత్ర హాస్పిటల్‌. తాడేపల్లిగూడెంలోని మదర్‌ వన్నిని ఆస్పత్రి, తణుకులోని యాపిల్‌ హాస్పిటల్‌, సాయిశ్వేత ఆస్పత్రి, సుధ ఆస్పత్రి. భీమవరంలోని మఽధచలపతి ఆస్పత్రి, వర్మ ఆస్పత్రి, శ్రీలక్ష్మీ ఆస్పత్రి. పాలకొల్లులోని శ్రీసూర్య నర్సింగ్‌ హోమ్‌, జంగారెడ్డిగూడెంలోని పీవీఆర్‌ ఆస్పత్రి, సాయిస్ఫూర్తి ఆస్పత్రి, వడ్లమూడి ఆస్పత్రి.


న్యూరో సర్జరీ సేవలకు ఏలూరు  చైత్ర ఆస్పత్రి, తణుకులోని యాపి ల్‌ ఆస్పత్రి, భీమవరం వర్మ ఆస్పత్రి, జంగారెడ్డిగూడెం సాయిస్ఫూర్తి ఆస్పత్రి. 


సర్జికల్‌ అంకాలజీ, మెడికల్‌ అంకాలజీ, రేడియేషన్‌ అంకాలజీ వైద్యసేవలకు ఏలూరులోని గుడ్‌ సమరిటన్‌ కేన్సర్‌ ఆస్పత్రి. 


ప్లాస్టిక్‌ సర్జరీ వైద్యసేవలకు తణుకులోని యాపిల్‌ ఆస్పత్రి, సాయిశ్వేత ఆస్పత్రి, భీమవరంలోని వర్మ ఆస్పత్రి, జంగారెడ్డిగూడెంలోని సాయిస్ఫూర్తి ఆస్పత్రి. 


పాలి ట్రామా వైద్యసేవలకు ఏలూరు భువనేశ్వరి ఆస్పత్రి, చైత్ర ఆస్పత్రి, మురళీకృష్ణ ఆస్పత్రి, ప్రభ ఆస్పత్రి, విజయ ఆస్పత్రి, ద్వారకాతిరుమలలోని విర్డ్స్‌ ఆస్పత్రి, తాడేపల్లిగూడెం మదర్‌ వన్నిని ఆస్పత్రి, ప్రణవి నర్సింగ్‌ హోమ్‌, తణుకులోని సాయిశ్వేత ఆస్పత్రి, శ్రీసాయి ఆస్పత్రి, సుధ ఆస్పత్రి. నిడదవోలులోని శేషగిరి ఆస్పత్రి. భీమవరంలోని అవినాశ్‌  ట్రామా ఆస్పత్రి, మధు చలపతి ఆస్పత్రి, శ్రీలక్ష్మి ఆస్పత్రి, వర్మ ఆస్పత్రి. పాల కొల్లులోని శ్రీ సూర్యనర్సింగ్‌ హోమ్‌, నరసాపురంలో శ్రీసూర్య ఆస్పత్రి, జానకీ ఆస్పత్రి. జంగారెడ్డిగూడెంలోని వడ్లమూడి ఆస్పత్రి, పీవీఆర్‌ ఆస్పత్రి, సాయిస్ఫూర్తి  ఆస్పత్రి. 


క్రిటికల్‌ కేర్‌ వైద్యసేవలకు ఏలూరులోని చైత్ర ఆస్పత్రి, మురళీకృష్ణ ఆస్పత్రి. తాడేపల్లిగూడెం మదర్‌ వన్నిని ఆస్పత్రి. తణుకులోని యాపిల్‌ ఆస్పత్రి, శ్రీసాయి ఆస్పత్రి, సుధ ఆస్పత్రి. భీమవరంలోని వర్మ ఆస్పత్రి. జంగారెడ్డిగూడెంలో సాయిస్ఫూర్తి ఆస్పత్రి, వడ్లమూడి ఆస్పత్రి. 


జనరల్‌ మెడిసిన్‌ వైద్య సేవలకు ఏలూరులోని భువనేశ్వరి ఆస్పత్రి, చైత్ర ఆస్పత్రి, మురళీకృష్ణ ఆస్పత్రి. తాడేపల్లిగూడెంలోని మదర్‌ వన్నిని ఆస్పత్రి. తణుకులోని శ్రీసాయి ఆస్పత్రి, సుధ ఆస్పత్రి, సాయిశ్వేతా ఆస్పత్రి, యాపిల్‌ ఆస్పత్రి, భీమవరంలోని వర్మ ఆస్పత్రి, జంగారెడ్డి గూడెంలోని పీవీఆర్‌ ఆస్పత్రి, సాయిస్ఫూర్తి ఆస్పత్రి, వడ్లమూడి ఆస్పత్రి. 


ఇన్‌ఫెక్షన్‌ డీసీజ్‌ వైద్య సేవలకు తాడేపల్లిగూడెంలోని మదర్‌ వన్నిని ఆస్పత్రి, తణుకులోని యాపిల్‌ హాస్పిటల్‌, జంగారెడ్డిగూడెం సాయిస్ఫూర్తి  ఆస్పత్రి. 


పీడీయాట్రిక్స్‌ వైద్య సేవలకు తణుకులోని యాపిల్‌ ఆస్పత్రి, సుధ హాస్పిటల్‌. భీమవరంలోని శ్రీలక్ష్మీ ఆస్పత్రి, వర్మ ఆస్పత్రి. జంగారెడ్డి గూడెంలోని పీవీఆర్‌ ఆస్పత్రి, సాయిస్ఫూర్తి ఆస్పత్రి, వడ్లమూడి ఆస్పత్రి. 


కార్డియాలజీ వైద్యసేవలకు తణుకులోని యాపిల్‌ ఆస్పత్రి, భీమవరంలోని వర్మ ఆస్పత్రి. 


నెఫ్రాలజీ వైద్యసేవలకు ఏలూరు చైత్ర ఆస్పత్రి, తణుకు యాపిల్‌ ఆస్పత్రి, భీమవరం వర్మ ఆస్పత్రి. 


న్యూరాలజీ వైద్యసేవలకు తణుకు యాపిల్‌ ఆస్పత్రి, భీమవరం వర్మ ఆస్పత్రి. 


పల్మనాలజీ వైద్యసేవలకు ఏలూరులో చైత్ర హాస్పిటల్‌, తణుకు యాపిల్‌ హాస్పిటల్‌, జంగారెడ్డిగూడెంలోని శ్రీసాయిస్ఫూర్తి హాస్పిటల్‌, వడ్లమూడి హాస్పిటల్‌. 


గ్యాస్ర్టో ఎంట్రాలజీ ఏలూరు చైత్ర హాస్పిటల్‌, భీమవరం వర్మ హాస్పిటల్‌.  

Updated Date - 2020-04-04T11:39:59+05:30 IST