సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు

ABN , First Publish Date - 2020-06-04T09:42:23+05:30 IST

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ప్రత్యేక చర్యలు

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా  ప్రత్యేక చర్యలు

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 3: సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ భారతి హోళికేరి సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ భవన స ముదాయంలోని కలెక్టర్‌ చాంబర్‌లో అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠితో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య నిర్వహ ణతో పాటు తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ  అధికారులను ఆదేశించారు.


మలేరియా, డెంగ్యూ వంటి విషజ్వరాలు వ్యాపించకుండా మురుగుకా ల్వలు, చెత్త చెదారం నిల్వవుండకుండా చూడటంతో పాటు గృహాలు, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వవుండకుండా చూసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పిం చాలన్నారు. దోమల నివారణ చర్యలకు సంబంధిత వైద్యాధికారులతో సమన్వ యంతో చర్యలు చేపట్టడంతో పాటు బ్లీచింగ్‌ పౌడర్‌ పిచికారి, క్లోరినేషన్‌ పనులు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శా ఖాధికారి నీరజ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి పాల్గొన్నారు. 


వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి..

మంచిర్యాల కలెక్టరేట్‌: వర్షాకాలపు వ్యాధుల నియంత్రణలో ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిశీలకురాలు ప్రభావతి పేర్కొన్నారు. బుధవారం మంచిర్యాలలోని చందనాపూర్‌లో డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, జలజనిత, వాయుజనిత, కీటక జనిత వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


కరోనా వైరస్‌ నియంత్రణలో వైద్యాధికారుల కృషి అభినందనీయమని, సీజనల్‌ వ్యాధులను కూడా ధరిచేరకుండా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని కోరారు.  డీఎంహెచ్‌ఓ డా. నీరజ, వైద్యులు నాగయ్య, ఉప వైద్యాధికారి డా. ఫయాజ్‌ఖాన్‌, జిల్లా సర్వేయలైన్స్‌ అధికారి బాలాజీ, జయప్రకాష్‌, అనిష్‌, సబ్‌ యూనిట్‌ అధికారి గుండేటి నాందేవ్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ అల్లాడి శ్రీనివాస్‌, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-04T09:42:23+05:30 IST