కరోనా నిరోధానికి ల్యాబ్ టెక్నీషియన్లకు స్పెషల్ జాకెట్లు

ABN , First Publish Date - 2020-07-11T13:37:29+05:30 IST

కరోనా సోకకుండా ల్యాబ్ టెక్నీషియన్లకు ప్రత్యేక జాకెట్లను రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ ఆరోగ్యశాఖ అధికారులు అందించారు....

కరోనా నిరోధానికి ల్యాబ్ టెక్నీషియన్లకు స్పెషల్ జాకెట్లు

జోధ్‌పూర్ (రాజస్థాన్) : కరోనా సోకకుండా ల్యాబ్ టెక్నీషియన్లకు ప్రత్యేక జాకెట్లను రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ ఆరోగ్యశాఖ అధికారులు అందించారు. ల్యాబ్ టెక్నీషియన్లు డీఆర్‌డీవో రూపొందించిన పీపీఈ కిట్ ధరించే ముందు ఈ ప్రత్యేక జాకెట్లు వేసుకోవాలి. ఈ స్పెషల్ జాకెట్లపై ఉన్న ద్రవం ల్యాబ్ టెక్నీషియన్ల శరీరం చల్లగా ఉంచుతుందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బల్వంత్ ముండా చెప్పారు. రాజస్థాన్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 17,070కి పెరిగిన నేపథ్యంలో ఆరోగ్యశాఖ కార్యకర్తల భద్రతకు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా రోగులకు పరీక్షలు చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లకు కరోనా సోకకుండా ముందుజాగ్రత్త చర్యగా స్పెషల్ జాకెట్లతోపాటు పీపీఈ కిట్ లు, మాస్క్ లు, గ్లౌజులు అందిస్తున్నారు. 

Updated Date - 2020-07-11T13:37:29+05:30 IST