టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2022-01-26T05:26:55+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభు త్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిం చిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
కొల్లాపూర్‌లో 50పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తున్న వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, చిత్రంలో మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి

- ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రజలకు అందుబాటులోకి రానున్న మూడు మెడికల్‌ కాలేజీలు

- కొల్లాపూర్‌లో 50పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు


కొల్లాపూర్‌, జనవరి 25 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభు త్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిం చిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం కొల్లాపూర్‌ మండలం రామాపురం గ్రామ శివారులో 50పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమా వేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ తెలం గాణ రాష్ట్రంలో ఎనిమిది మెడికల్‌ కాలేజీలు తీసు కొచ్చి ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల సేవ లను ప్రభుత్వం చేరువ చేస్తోందని, ఉమ్మడి మహ బూబ్‌నగర్‌ జిల్లాలోనే మూడు మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయని హరీశ్‌రావు పేర్కొ న్నారు. మరోవైపు మన ఊరు మన బడి కార్యక్రమం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయాలని రూ.7289కోట్ల ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తూ ఇంగ్లిష్‌ మీడి యం విద్యాబోధన తేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై బీజేపీ నేతలు మంచిని చూసి జీర్ణించుకోలేక ఏడుపు ప్రారంభించారని ఆయన ఎద్దేవా చేశారు. నిరుద్యో గులకు ఉద్యోగాలిస్తామంటే కోర్టుల్లో కేసులు వేస్తా రు.. పేదలకు ఇంగ్లిష్‌ మీడియం విద్యనందిస్తామంటే బీజేపీ నేతలు విమర్శలు చేస్తారని, దున్నపోతు ఈనిందంటే దూడను దొడ్డిలో కట్టేయమన్నట్లు  రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీల తీరు ఉందని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎంపీ రాములు, జడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి, నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కలెక్టర్‌ పి.ఉదయ్‌కు మార్‌, ఆడిషనల్‌ కలెక్టర్‌ మనూచౌదరి,  ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు సాయిచంద్‌, ఎర్రోళ్ల శ్రీనివాసులు, డీఎంహెచ్‌వో సుధాకర్‌లాల్‌, డీసీసీబీ డైరెక్టర్‌ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, దూరెడ్డి రఘువర్ధన్‌రెడ్డి, జట ప్రోల్‌ సర్పంచ్‌ ఎస్‌కే.ఖాజా, సింగిల్‌ విండో చైర్మన్‌ పెబ్బేటి కృష్ణయ్య, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ రఘు ప్రోలు విజయలక్ష్మి, టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు తాళ్ల పరుశరామ్‌గౌడ్‌, పట్టణ మాజీ ఉప సర్పంచ్‌ చంద్ర శేఖరాచారి, నాయకులు జాఫర్‌, ఖాదర్‌పాషా, బొరెల్లి మహేష్‌, మూలే కేశవులు, రాఘవేంద్ర, మునిసిపల్‌ కౌన్సిలర్లు కృష్ణమూర్తి, బద్దుల రా ముడు, మునిసిపల్‌ కో ఆప్షన్‌ బండల వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. 


 డయాలసిస్‌ సెంటర్‌ మంజూరు 

50పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభం అనంతరం స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి కొల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న కిడ్నీ రోగుల అవస్థలు తీర్చాలని, స్థానికంగా డయాలసిస్‌ సెం టర్‌ను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా 50పడకల ఆసుపత్రిని వంద పడకలకు పెంచాలని, చిన్నంబావి మండల కేంద్రంలో, సింగోటం గ్రామంలో పీహెచ్‌సీ లు ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావును కోరారు. స్పందించిన మంత్రి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు కిడ్నీ రోగుల అవస్థలు తీర్చేందుకు కొల్లాపూర్‌లో డయాలసిస్‌ సెంటర్‌ను వెంటనే మంజూరు చేస్తామని, అదేవిధంగా 50పడ కల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని వంద పడకల ఆసుపత్రిగా పెంచుతామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. దీంతో నియోజకవర్గ పరిధిలో ఉన్న దాదాపు 200మందికి పైగా కిడ్నీ రోగులకు డయాలసీస్‌ అవస్థలు తప్పనున్నాయి. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. 



Updated Date - 2022-01-26T05:26:55+05:30 IST