కాలనీ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2022-05-28T06:28:46+05:30 IST

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలపై అధి కారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన కాపల్లి జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి ఆదేశించారు. మండలంలోని మాకవరపాలెం, తామరం, గిడుతూరు గ్రామాల్లో కాలనీ ఇళ్ల నిర్మాణాలను పరిశీ లించారు.

కాలనీ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి
మాకవరపాలెంలో నిర్మాణాలను తెలుసుకుంటున్న కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి

 గృహ నిర్మాణ శాఖ అధికారులకు అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి ఆదేశం

 మాకవరపాలెం మండలంలో విస్తృత పర్యటన 

 మూడు గ్రామాల్లో  ఇళ్ల పనుల పరిశీలన

మాకవరపాలెం, మే 27 : జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలపై అధి కారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన కాపల్లి జిల్లా  కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి ఆదేశించారు. మండలంలోని మాకవరపాలెం, తామరం, గిడుతూరు గ్రామాల్లో కాలనీ ఇళ్ల నిర్మాణాలను పరిశీ లించారు. మాకవరపాలెంలో ఎన్ని ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు, తాగునీటి వసతులు, బిల్లుల మంజూరుపై గృహ నిర్మాణ శాఖ అధికారుల ద్వారా ఆరా తీశారు. మెటీరియల్‌ ఎక్కడి నుంచి తీసుకు వస్తున్నది  అడిగి తెలుసుకున్నారు. అనంతరం తామరంలోని సచివాలయాన్ని సందర్శించి, అర్హులందరికీ పథకాలు అందేలా చూడాలని సిబ్బందికి సూచించారు. అక్కడి నుంచి   గిడుతూరులో చెత్తసంపద కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. తడి, పొడి చెత్త నుంచి తయారైన ఎరువు అక్కడే ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎరువు రైతులకు ఇవ్వకుండా ఎందుకు ఉంచారంటూ అధికారులను ప్రశ్నించారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ రైతులు మొగ్గు చూపడం లేదని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డీవో అరుణశ్రీ, తహసీల్దార్‌ రాణి అమ్మాజీ, హౌసింగ్‌ ఏఈ రామలింగస్వామి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

చోడవరం మండలంలో జేసీ పర్యటన

చోడవరం : జగనన్న కాలనీల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు వేగవంతం కావాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని అంభేరుపురం, నరసయ్యపేట, ఖండేపల్లి  తదితర గ్రామాల్లో పర్యటించారు, ఈ సం దర్భంగా ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఇళ్ల ప్రగతికి సంబంధించి అధికారులతో జేసీ సమీక్ష నిర్వహించార తహసీల్దార్‌ బి.తిరు మలబాబు, ఈవోపీఆర్‌డీ బి. చైతన్య, హౌసింగ్‌ ఏఈ రమణమూర్తి, ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ కనకమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-28T06:28:46+05:30 IST