దిశ యాప్‌ డౌన్‌లోడ్‌కు ప్రత్యేక డ్రైవ్‌

ABN , First Publish Date - 2022-05-21T06:27:43+05:30 IST

మహిళల రక్షణ కోసం ముమ్మరంగా దిశ యాప్‌ డౌన్‌లోడుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టినట్లు ఎన్‌టీఆర్‌ జిల్లా పోలీసు కమిషనర్‌ కాంతి రాణా చెప్పారు.

దిశ యాప్‌ డౌన్‌లోడ్‌కు ప్రత్యేక డ్రైవ్‌
దిశయాప్‌ డౌన్‌లోడ్‌ కార్యక్రమంలో సీపీ కాంతిరాణా,

దిశ యాప్‌ డౌన్‌లోడ్‌కు ప్రత్యేక డ్రైవ్‌

వన్‌టౌన్‌, మే 20: మహిళల రక్షణ కోసం ముమ్మరంగా దిశ యాప్‌ డౌన్‌లోడుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టినట్లు ఎన్‌టీఆర్‌ జిల్లా పోలీసు కమిషనర్‌ కాంతి రాణా చెప్పారు. శుక్రవారం విజయవాడలో  జరిగిన ప్రత్యేక డ్రైవ్‌ను ఆయన పర్యవేక్షించారు వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని కనకదుర్గ ఫ్లై ఓవర్‌ వద్ద ఆయన మహిళలను, విద్యార్థులను, యువతులను పలకరించి దిశయాప్‌ డౌన్‌లోడు చేయించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ, ప్రతి మహిళ మొబైల్‌లో దిశయాప్‌ డౌన్‌లోడు ఉండాలన్నారు. మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన యాప్‌ను ప్రతి ఒక్కరు సద్వినియోగ పరచుకోవాలన్నారు.

న్యాయవాదులకు దిశ యాప్‌ ఇన్‌స్టాల్‌

విజయవాడ లీగల్‌ : బెజవాడ బార్‌ అసోసియేషన్‌లో న్యాయవాదులకు శుక్రవారం పోలీసులు దిశ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేశారు. ఈ యాప్‌ మహిళలకే సంబంధించింది కాదని, ఎవరైనా, ఎక్కడైనా మహిళలకు అన్యాయం, దౌర్జన్యం, దాడులు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయని తెలిస్తే వారి వద్ద ఫోన్‌ వున్నా ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కితే పోలీసులే ఫోన్‌ చేసి విషయం తెలుసుకుంటారని వివరించారు. బార్‌లో ఉన్న మహిళా న్యాయవాదులతోపాటు పురుష న్యాయవాదులకు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేశారు.

కేదారేశ్వరపేట(పాతరాజరాజేశ్వరి పేట): స్థానిక కేదారేశ్వరపేట, ఎర్రకట్ట రోడ్డులో శుక్రవారం అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసులు దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎండను సైతం లెక్కచేయకుండా ఆ దారిలో రాకపోకలు చేసే వాహనదారులను, పాదచారులను  నిలుపుదల చేసి పోలీసులు దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేస్తున్నారు. 



Updated Date - 2022-05-21T06:27:43+05:30 IST