Abn logo
Mar 2 2021 @ 22:47PM

టీడీపీ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేయడం అమానుషం

ఆత్మకూరు, మార్చి 2: మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా గెలవాలని చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని జడ్పీ మాజీ ఛైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో స్థానిక టీడీపీ నేతలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో ఆరు సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 15వ వార్డు అభ్యర్థిని వైసీపీ నేతలు ప్రలోభాలకు గురిచేసి మభ్యపెట్టి నామినేషన్‌ ఉపసంహరణకు ప్రయత్నించడం అరాచకమన్నారు. ధైర్యంతో వైసీపీ నేతల వద్ద నుంచి టీడీపీ చెంతకు చేరిన మంగమ్మ సాహసాన్ని ప్రశంసించారు. అదే స్పూర్తితో టీడీపీ అభ్యర్థులు, నేతలు ఎన్నికల్లో పోరాడి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. వైసీపీ నేతల అరాచకాలకు ఎదురొడ్డి నిలబడేందుకు తామందరం సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఇందూరు వెంకట రమణారెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌చైౖర్మన్‌ తుమ్మల చంద్రారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు, నుడా మాజీ డైరక్టర్‌ షేక్‌ ఖాజావలి, జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు కేతా విజయభాస్కర్‌రెడి, పిడికిటి వెంకటేశ్వర్లు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement