పోలీస్‌స్టేషన్ల్లను పరిశీలించిన ఎస్పీ

ABN , First Publish Date - 2022-05-26T04:09:04+05:30 IST

కాగజ్‌నగర్‌ పట్టణ, రూరల్‌ పోలీస్టేషన్లను బుధవారం ఎస్పీ సురేష్‌కుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా పెండింగ్‌ కేసులు, ఇతర సమ స్యలపై డీఎస్పీ కరుణాకర్‌, సీఐలను అడిగి తెలుసుకు న్నారు. పోలీస్‌స్టేషన్‌లో 5ఎస్‌ ఇంప్లిమెంటేషన్‌, వర్టికల్‌ విధానాన్ని వెంటనే అమలు చేయాలన్నారు.

పోలీస్‌స్టేషన్ల్లను పరిశీలించిన ఎస్పీ
కాగజ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ సురేష్‌ కుమార్‌

కాగజ్‌నగర్‌, మే 25: కాగజ్‌నగర్‌ పట్టణ, రూరల్‌ పోలీస్టేషన్లను బుధవారం ఎస్పీ సురేష్‌కుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా  పెండింగ్‌ కేసులు, ఇతర సమ స్యలపై డీఎస్పీ కరుణాకర్‌, సీఐలను అడిగి తెలుసుకు న్నారు. పోలీస్‌స్టేషన్‌లో 5ఎస్‌ ఇంప్లిమెంటేషన్‌, వర్టికల్‌ విధానాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. పెట్రోకార్‌, బ్లూకోట్‌, ఇతర పనితీరు విష యంలో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారితో మర్యా దగా మాట్లాడాలన్నారు. గ్రామాల్లో గస్తీ పెంచాలన్నారు. 100డయల్‌ ఫిర్యాదులపై స్పందన వేగవంతం చేయాలన్నారు. ఆయన వెంట సీఐలు రవీందర్‌, రాజేంద్ర ప్రసాద్‌, ఎస్సై సోనియా పాల్గొన్నారు.

ప్రణాళికబద్దంగా ప్రిపేర్‌ కావాలి

పోలీసు శాఖలో ఖాళీ పోస్టులకు ప్రిపేపరవుతున్న అభ్యర్థులు ప్రణాళిక బద్దంగా ప్రిపేర్‌ కావాలని ఎస్పీ సురేష్‌కుమార్‌ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే కోనప్ప ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీసు శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రణాళిక బద్దంగా చదువాలన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు కోనేరు కృష్ణా రావు మాట్లాడుతూ పోటీపరీక్షలు రాసే అభ్యర్థు లందరికీ అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. సమావేశంలో డీఎస్పీ సురేష్‌కుమార్‌, పట్టణ సీఐ రవీందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-26T04:09:04+05:30 IST