రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలి : ఎస్పీ

ABN , First Publish Date - 2021-12-09T03:45:46+05:30 IST

జిల్లాలోని పోలీ్‌స స్టేషన్‌లలో అన్నిరకాల రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని, లేదంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఎస్పీ సీహెచ్‌ విజయరావు తెలిపారు.

రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలి : ఎస్పీ
దుత్తలూరు : సిబ్బందికి సూచనలిస్తున్న ఎస్పీ విజయరావు

ఉదయగిరి రూరల్‌, డిసెంబరు 8: జిల్లాలోని పోలీ్‌స స్టేషన్‌లలో అన్నిరకాల రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని, లేదంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఎస్పీ సీహెచ్‌ విజయరావు తెలిపారు. బుధవారం స్థానిక సర్కిల్‌ కార్యాలయం, పోలీ్‌సస్టేషన్‌లలో రికార్డులు తనిఖీ చేయడంతోపాటు లాకప్‌, కంప్యూటర్‌ గదులు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు నుంచి కేసు చివరి వరకు భద్రంగా ఉంచిన రికార్డులను పరిశీలించానన్నారు. రికార్డుల సక్రమంగా నిర్వహించని వారికి మెమోలు జారీ చేస్తామన్నారు. ఉదయగిరి సర్కిల్‌, పోలీ్‌సస్టేషన్‌లలో రికార్డుల నిర్వహణ బాగుందని, కార్యాలయాల పరిసరాలు సైతం పరిశుభ్రంగా ఉంచుకున్నారన్నారు. సీఐ గిరిబాబు ఆధ్వర్యంలో సిబ్బంది సమన్వయంతో శాంతిభద్రత పరిరక్షణకు పని చేస్తున్నారన్నారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో కావలి డీఎస్పీ డీ.ప్రసాద్‌, ఎస్‌ఐలు అంకమ్మ, సాయిరెడ్డి, లతీపున్నీసా, ఏఎ్‌సఐలు శ్రీనివాసులు, వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T03:45:46+05:30 IST