పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తా : ఎస్పీ

ABN , First Publish Date - 2020-10-30T05:20:52+05:30 IST

పోలీస్‌ సిబ్బంది సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్‌ అన్నారు.

పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తా : ఎస్పీ

ఏలూరు క్రైం, అక్టోబరు 29 : పోలీస్‌ సిబ్బంది సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్‌ అన్నారు. జిల్లా పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది అనారోగ్యానికి గురై మరణించడంతో వారి కుటుంబ సభ్యులకు కార్పస్‌ ఫండ్‌ నుంచి లక్ష రూపాయల చెక్కును ఒక్కొక్కరికి ఏలూరులోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అందించారు. అనా రోగ్యంతో  ఎస్‌ఐ సోమయ్య  అక్టోబరు 26న 2019లో మరణించగా ఆయన కుమారుడు ధర్మన్న దొరకి భద్రత నిధుల నుంచి 7,66,626 రూపాయల చెక్కు, కార్ఫస్‌ ఫండ్‌ నుంచి లక్ష రూపాయల చెక్కు అందించారు. హెడ్‌ కానిస్టేబుల్‌ కె.జయరావు అనారోగ్యంతో మరణించగా ఆయన సతీమణి కె.బుజ్జీకి కార్పస్‌ ఫండ్‌ నుంచి లక్ష రూపాయల చెక్కు, హెడ్‌ కానిస్టేబ్‌ పీవీ రమణ అనారోగ్యంతో మరణించగా ఆయన సతీమణి రేవతికి, హెడ్‌ కానిస్టేబుల్‌ కేతా నాగరాజు అనారోగ్యంతో మరణించగా ఆయన సతీమణి కె.నాగలక్ష్మికి లక్ష రూపాయల వంతున చెక్కులను అందించారు. అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు, ఏఆర్‌ అదనపు ఎస్పీ మహేష్‌కుమార్‌, ఏఆర్‌ డీఎస్పీ కృష్ణంరాజు, డీసీఆర్‌బి సీఐ కృష్ణారావు, పోలీసు అధికారుల సంఘ అధ్యక్షుడు ఆర్‌ నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2020-10-30T05:20:52+05:30 IST