Advertisement
Advertisement
Abn logo
Advertisement

మామూలు పాలకు బదులుగా సోయా పాలను వాడొచ్చా?

ఆంధ్రజ్యోతి(23-07-2021)

ప్రశ్న: మామూలు పాలకు ప్రత్యామ్నాయంగా సోయా పాలను వాడొచ్చా? సోయాపాలలో ఎటువంటి పోషక విలువలుంటాయి?


- రాగిణి, మంచిర్యాల


డాక్టర్ సమాధానం: శాకాహారులకు అత్యుత్తమమైన ప్రొటీన్ల ఖజానా సోయా. ఆ సోయా గింజల నుండి తయారుచేసేవే సోయాపాలు. ఆవు లేదా గేదెపాలు పడని వారు, ఏవైనా కారణాల వల్ల అవి తాగేందుకు ఇష్టపడని వారు, వాటికి ప్రత్యామ్నాయంగా సోయాపాలను వాడవచ్చు. మామూలు పాలతో పోలిస్తే సోయాపాలలో కెలోరీలు తక్కువే. సోయాపాలలో కూడా మాములు పాలలానే ప్రొటీన్లు అధికం. దీనితో పాటు కొంచెం పిండి పదార్థాలు, పీచు పదార్థాలు కూడా సోయాపాలలో లభిస్తాయి. విటమిన్‌- కె, థయామిన్‌, ఫోలేట్‌ వంటి విటమిన్లు, మాలిబ్డినమ్‌, కాపర్‌, ఫాస్ఫరస్‌, మాంగనీస్‌ లాంటి ఖనిజ లవణాలు సోయాలో పుష్కలం. సోయాపాలలో అధికంగా ఉండే ఐసోఫేవన్స్‌ గుండె జబ్బులు, రొమ్ము కాన్సర్‌, ప్రోస్టేట్‌ కాన్సర్‌ మొదలైన వాటి నుండి రక్షణనిస్తాయి. సోయాబీన్స్‌ అంటే అలెర్జీలు ఉన్న వారు తప్ప మిగతా వారందరు వీటి పాలను తాగవచ్చు. అయితే మార్కెట్లో అధికంగా లభించే సోయాపాలలో రుచికోసం చక్కెర కలిపినవి ఉంటున్నాయి. అవి కాకుండా చక్కెర కలపని సోయాపాలని ఎంచుకుంటే ఆరోగ్యానికి మంచిది. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutriful.com(పాఠకులు తమ సందేహాలను 

[email protected]కు పంపవచ్చు)

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...