Caterpillar: గొంగళి పురుగులతో స్నాక్స్.. వినూత్న ఆలోచనతో ఆకట్టుకుంటున్న దక్షిణాఫ్రికా కంపెనీ!

ABN , First Publish Date - 2022-07-08T21:31:18+05:30 IST

గొంగళి పురుగులను చూస్తే చాలా మందికి అసహ్యం వేస్తుంది. వాటిని చూసేందుకు కూడా కొందరు భయపడుతుంటారు.

Caterpillar: గొంగళి పురుగులతో స్నాక్స్.. వినూత్న ఆలోచనతో ఆకట్టుకుంటున్న దక్షిణాఫ్రికా కంపెనీ!

గొంగళి పురుగులను చూస్తే చాలా మందికి అసహ్యం వేస్తుంది. వాటిని చూసేందుకు కూడా కొందరు భయపడుతుంటారు. అయితే south africaకి చెందిన ఓ ఫుడ్ కంపెనీ గొంగళి పురుగులతో ఏకంగా స్నాక్స్ తయారు చేస్తోంది.  గొంగళి పురుగులతో చాక్లెట్స్, బిస్కెట్స్‌ తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తోంది. దక్షిణాఫ్రికాకు చెందిన కెమికల్ ఇంజనీర్ వెండీ వెసెలా.. గొంగళి పురుగులను పిండిగా మార్చే పద్ధతిని కనుగొన్నారు. ఆ పిండితో రకరకాల స్నాక్స్ తయారు చేస్తున్నారు.


ఇది కూడా చదవండి..

Bengaluru: ఉద్యోగం కోసం వినూత్న ప్రయత్నం.. ఫుడ్‌ బాక్స్‌లో రెజ్యూమ్..


ఆకుపచ్చ, నలుపు రంగు గొంగళి పురుగులను ఓ ప్రత్యేకమైన టెక్నిక్ ద్వారా పిండిగా మార్చి.. దానితో బిస్కెట్లు, చాక్లెట్లు, ప్రొటీన్ బార్లు, షేక్స్, స్మూతీస్ తయారు చేస్తున్నారు. Caterpillarsలో ఎన్నో రకాల ప్రోటీన్స్ ఉన్నాయని, అవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని, అందుకే స్నాక్స్ రూపంలో అందరికీ అందిస్తున్నామని వెండీ వెసెల్లా చెబుతున్నారు. జోహన్నెస్‌బర్గ్‌లోని శాండ్‌టన్‌లోని జరిగిన ఫుడ్ ఫెయిర్‌లో గొంగళిపరుగుల చాక్లెట్స్, బిస్కెట్స్‌ని ప్రదర్శనకు ఉంచినప్పుడు మంచి స్పందన వచ్చింది. వాటిని తినేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. 


తనకు గొంగళిపురుగులను చూడాలంటేనే భయమని, కానీ వాటితో తయారు చేసిన చాక్లెట్స్ ఎంతో రుచికరంగా ఉన్నాయని ఓ కస్టమర్ చెప్పారు. వెండీస్ సృష్టించిన ఈ ఆర్గానిక్ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది. కీటకాల నుంచి తయారైన ఆహార పదార్థాలకు పాశ్చాత్య దేశాల్లో క్రమంగా గిరాకీ పెరుగుతోంది. గొంగళి పురుగులతో పిజ్జా టాపింగ్స్‌ కూడా తయారు చేస్తున్నామని, త్వరలోనే వీటిని కూడా పరిచయం చేస్తామని వెండీస్ తెలిపారు.


Updated Date - 2022-07-08T21:31:18+05:30 IST