కలగా మిగిలిన క్రమబద్ధీకరణ

ABN , First Publish Date - 2022-08-11T05:36:34+05:30 IST

ఇల్లెందు పట్టణానికి క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 76ప్రకా రం పట్టణంలోని స్టేషన్‌బస్తీకి ఈ సారైనా క్రమబద్ధీకరణ వర్తించేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కలగా మిగిలిన క్రమబద్ధీకరణ
స్టేషన్‌బస్తీ ఏరియా

 స్టేషన్‌బస్తీకి వర్తించేనా?

 గతంలో రెండు పర్యాయాలు దరఖాస్తులు చేసినా ఫలితం శూన్యం

 రైల్వే, రెవెన్యూ స్థలాలు గుర్తింపుపై మీమాంస

ఇల్లెందుటౌన్‌, ఆగస్టు 8: ఇల్లెందు పట్టణానికి క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 76ప్రకా రం పట్టణంలోని స్టేషన్‌బస్తీకి ఈ సారైనా క్రమబద్ధీకరణ వర్తించేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైల్వేస్టేషన్‌కు అతిసమీపంలో స్టేషన్‌బస్తీ ఉండటంతో గతంలో రెండు పర్యాయాలు బస్తీవాసులు క్రమబద్ధీకరణకోసం దరఖాస్తులు చేయగా రైల్వే స్ధలాలు ఉన్నాయనే కారణంతో వచ్చి న దరఖాస్తులు సుమారుగా 600 పైచిలుకుగా రెవెన్యూ అధికారులు తిరస్కరించారు. అయితే ప్రస్తుతం మరోపర్యాయం జీవో నెం 76 ప్రకారం క్రమబద్ధీకరణ దరఖాస్తులను స్వీకరిస్తుండటంతో స్టేషన్‌బస్తీ వాసులు తాము దరఖాస్తులు చేసుకోవాలంటేనే భయాందోళనలకు గురవుతున్నారు.

బ్రిటి్‌షకాలంనుంచి రైల్వేస్టేషన్‌ ఉండటంతో రైల్వే స్థలాలు సహజంగానే ఉన్నాయి. ప్రస్తుతం రైల్వే స్థలాలు అక్రమణలో ఉన్నాయి. స్టేషన్‌బస్తీలో 20, 21 వార్డుల సమూహంగా ఉన్నప్పటీకీ రైల్వే స్టేషన్‌కు 130.3మీటర్ల పరిధివరకు రైల్వే స్థలాలుగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఇందులో సుమారు 200ల వరకు గృహలు ఉన్నాయి. రెండు వార్డుల్లో సుమారు 600 పైచిలుకుగా ఇళ్లు ఉండగా గతంలో ఎవరికి క్రమబద్ధీకరణ వర్తించలేదు. రైల్వే, రెవెన్యూ అధికారుల జాయింట్‌ సర్వే చేయాల్సి ఉండగా ఇప్పటివరకు అలాంటి చర్యలు సాగలేదు. ఐదు సంవత్సరాలుగా క్రమబద్ధీకరణ దరఖాస్తులు చేస్తుండగా ఇప్పటి వరకు స్టేషన్‌బస్తీ వాసుల సమస్య మాత్రం ఎప్పటిలాగానే ఉంది. రైల్వే స్ధలాలు కాకుండా రెవెన్యూ పరిధి కూడా ఉన్నట్లుగా ఇటివల రెవెన్యూ అధికారులు గుర్తించారు. సర్వే నెంబర్‌ 537లో ఉన్న గృహలకు క్రమబద్ధీకరణ వర్తించే విధంగా రెవెన్యూఅఽధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటీకీ ఇంకా పూర్తిస్థాయిలో ప్రజలు నమ్మడంలేదు. మరల దరఖాస్తు చేస్తే వేలాది రూపాయాలు నష్టపోవాల్సి వస్తుందేమోననే ఆందోళనలలో స్టేషన్‌బస్తీవాసులు ఉన్నారు. స్టేష్‌బస్తీతో పాటు రైల్వే ట్రాక్‌కు అనుకొని ఉన్న 19వవార్డు పరిధిలోని బస్టాండ్‌ ఏరియా ముందుబాగంతోపాటు ఎల్‌బీఎ్‌సనగర్‌లో కొంతమేర భాగంకూడా రైల్వేస్థలాలుగానే ఉన్నాయి. వీరుకూడా గతంలో దరఖాస్తు చేసుకున్నా క్రమబద్ధీకరణ వర్తించలేదు. ఈ ప్రాంతాల్లో కూడా రెవెన్యూ స్థలాలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతుంది. అయితే రెండు శాఖలు అటు రైల్వే, ఇటు రెవెన్యూ స్థలాలు ఉన్నట్లుగా ఉన్న స్టేషన్‌బస్తీకి మాత్రం క్రమబద్ధీకరణ కళగానే మిగిలిపోయిందని బస్తీ వాసులు ఆవేదన చెందుతున్నారు. క్రమబద్ధీకరణ వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ 20వ వార్డు కౌన్సిలర్‌ లక్ష్మి ఎమ్మెల్యే బానోత్‌హరిప్రియను కలిసి చర్చించారు. ఈమేరకు స్పందించిన ఎమ్మెల్యే స్ధానిక తహసీల్దార్‌తో మాట్లాడారు. జాయింట్‌ సర్వే చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అవసరం అయితే కలెక్టర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.  


Updated Date - 2022-08-11T05:36:34+05:30 IST