పబ్జీ ఆడొద్దని చెప్పినందుకు.. తండ్రి గొంతు కోసిన కొడుకు

ABN , First Publish Date - 2020-10-19T07:10:22+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో‌ని మీరట్ నగరంలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. పబ్జీ గేమ్‌ను ఎక్కువ సేపు ఆడొద్దని

పబ్జీ ఆడొద్దని చెప్పినందుకు.. తండ్రి గొంతు కోసిన కొడుకు

మీరట్: ఉత్తరప్రదేశ్‌లో‌ని మీరట్ నగరంలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. పబ్జీ గేమ్‌ను ఎక్కువ సేపు ఆడొద్దని చెప్పినందుకు.. తండ్రి మెడను కొడుకు కత్తితో కోసేశాడు. అనంతరం అదే కత్తితో కొడుకు తన మెడను కూడా కోసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇద్దరికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని, పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అమీర్ అనే వ్యక్తి తన తండ్రి పబ్జీ ఆడొద్దని చెప్పినందుకు మనస్థాపానికి గురయ్యాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ కారణంగానే తండ్రిపై దాడి చేసి తరువాత తన మెడను కూడా కోసుకున్నాడని అంటున్నారు. 


అనంతరం అమీర్ ఇంట్లో నుంచి బయటకు రావడంతో స్థానికులు అతడిని కంట్రోల్ చేసేందుకు యత్నించినట్టు తెలుస్తోంది. అయితే స్థానికులపై కూడా అమీర్ దాడి చేయడానికి ప్రయత్నించాడని పోలీసులు చెబుతున్నాడు. అమీర్ డ్రగ్స్‌కు బానిస అయిపోయాడని పోలీసులు పేర్కొన్నారు. కాగా.. కొద్ది రోజుల క్రితం పబ్జీ గేమ్‌ను కేంద్ర ప్రభుత్వం నిసేధించిన విషయం తెలిసిందే. అయితే డౌన్‌లోడ్ అయి ఉన్న గేమ్‌లను మాత్రం యూత్ వదలకుండా ఆడుతోంది. పబ్జీ గేమ్ కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కొన్ని వందల హత్య, ఆత్మహత్య కేసులు నమోదుకావడం విశేషం.

Updated Date - 2020-10-19T07:10:22+05:30 IST