గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
ఆదిభట్ల, మే 27: ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కొంగరకలాన్‌లో శుక్రవారం జరిగింది. ఆదిభట్ల సీఐ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. కొంగరకలాన్‌లో నిర్మాణంలో ఉన్న కలెక్టరేట్ సమీప బోడబండ నీటి గుంతలో పడి ఓ యువకుడు మృతిచెందాడన్నారు. మృతుడి వి వరాలు లభ్యం కాలేదన్నారు. అతడి వొంటిపై డ్రాయర్ మాత్రమే ఉందని, అతడు ఈత కోసమే దిగి మరణించి ఉండొచ్చన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిస్తే 8333993512 అనే నెంబర్లో సంప్రదించాలని పోలీసులు పేర్కొన్నారు.