జీవీఎంసీ కమిషనర్‌కు సమ్మె నోటీసు అందజేస్తున్న సీఐటీయూ నేత వెంకటరెడ్డి
సమ్మె నోటీసు అందజేసిన సీఐటీయూ
విశాఖపట్నం, జనవరి 24(ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ పరిధిలోని కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో సీఐటీయూ నేతలు కమిషనర్‌కు సోమవారం సమ్మె నోటీసు అందజేశారు. కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులకు జోవో ఆర్‌టీ నంబర్ 1615 అమలుచేయాలని, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలనే డిమాండ్‌తో ఏపీ మునిసిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపు మేరకు సోమవారం కమిషనర్‌కు నోటీసులను అందజేసినట్టు సీఐటీయూ మునిసిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పి.వెంకటరెడ్డి తెలిపారు. 14 రోజుల్లోగా సమస్య పరిష్కరించకపోతే ఏక్షణంలోనైనా నివరధిక సమ్మెకు దిగుతామని నోటీసులో పేర్కొన్నారు.