‘విద్యా రంగ సమస్యలు పరిష్కరించండి’

ABN , First Publish Date - 2021-06-15T04:59:02+05:30 IST

ఉపాధ్యాయులు, విద్యా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీటీఎఫ్‌, విద్యా పరిరక్షణ సమితి ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం జేసీ మహేష్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు.

‘విద్యా రంగ సమస్యలు పరిష్కరించండి’
జేసీకి వినతిపత్రం ఇస్తున్న దృశ్యం

విజయనగరం రూరల్‌: ఉపాధ్యాయులు, విద్యా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీటీఎఫ్‌, విద్యా పరిరక్షణ సమితి ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం జేసీ మహేష్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. పాఠశాలలను తరలించాలన్న నిర్ణయాన్ని  ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు డి.ఈశ్వరరావు డిమాండ్‌  చేశారు.   ప్రాఽథమిక పాఠశాలల్లో చదువుతున్న వారిని, మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలకు తరలిస్తే డ్రాపౌట్స్‌ పెరిగే అవకాశం ఉందన్నారు.  1:20 నిష్పత్తిలో ఉపాధ్యాయులను నియమించాలన్నారు.  ఏపీటీఎఫ్‌, విద్యా పరిరక్షణ కమిటీ  సభ్యులు ఎ.సదాశివరావు, డి.ఈశ్వరరావు, పి.ధనుంజయరావు పాల్గొన్నారు. 

  ప్రీ ప్రైమరీ తరగతులు అనుసంధానం చేయాలి 

కలెక్టరేట్‌: ప్రాథమిక పాఠశాలలకు ప్రీ ప్రైమరీ తరగతులు అనుసం ధానం చేయాలని ఫ్యాప్టో నాయకులు డిమాండ్‌ చేశారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులను ప్రీ ప్రైమరీ తరగతుల బోధనకు నియమించాలని కోరారు.  ఈ మేరకు సోమవారం డీఈవో నాగమణికి వినతి పత్రం ఇచ్చారు.  అన్ని ప్రాఽథమిక పాఠశాలలు కొనసాగించాలని ,  మాతృభాషలో బోధన చేయాలని కోరారు.  ప్రతి మండల కేంద్రంలో 400 కంటే ఎక్కువ రోల్‌ ఉన్న  ఉన్నత పాఠశాలల్లో  తరగతులు ప్రారభించాలని చెప్పారు.  యూటీఎఫ్‌ నాయకులు  ఈశ్వరరావు, రమేష్‌ పట్నాయక్‌ , రాష్ట్ర నాయకులు డి.రాము, ఎస్‌టీయూ నాయకులు అప్పారావు , శ్యామ్‌ తదితరులు ఉన్నారు. 

  

Updated Date - 2021-06-15T04:59:02+05:30 IST