చుండ్రు సమస్య వేధిస్తుంటే.. వారానికోసారి ఇలా చేయండి!

ABN , First Publish Date - 2022-04-07T19:15:56+05:30 IST

వంటల్లో తరచుగా వాడే పదార్థం. అయితే దీన్ని సౌందర్య చికిత్సల్లో ఉపయోగించుకోవచ్చు. శుభ్రపరిచే పనులకు కూడా వాడుకోవచ్చు.

చుండ్రు సమస్య వేధిస్తుంటే.. వారానికోసారి ఇలా చేయండి!

ఆంధ్రజ్యోతి(07-04-2022)

వంటల్లో తరచుగా వాడే పదార్థం. అయితే దీన్ని సౌందర్య చికిత్సల్లో ఉపయోగించుకోవచ్చు. శుభ్రపరిచే పనులకు కూడా వాడుకోవచ్చు.


అదెలాగంటే...

టాయ్‌లెట్‌: టాయ్‌లెట్‌ దుర్వాసనలు వదలాలంటే సోడా ఉప్పు చల్లి, గంట తర్వాత రుద్ది, నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే టాయ్‌లెట్‌ దుర్వాసన వదలడంతో పాటు, పూర్తిగా శుభ్రపడుతుంది.

దుప్పట్లు: దుప్పట్లు మురికి వదిలి, శుభ్రపడాలంటే వాటిని వాషింగ్‌ మిషన్‌లో వేసేటప్పుడు ఒక కప్పు సోడా ఉప్పు, అర కప్పు వెనిగర్‌ కలపాలి. ఇలా చేస్తే దుప్పట్ల మురికితో పాటు దుర్వాసనలూ వదులుతాయి.

చర్మం తాజాగా: ముఖం జిడ్డు వదలి, చర్మ రంధ్రాలు శుభ్రపడాలంటే, ముఖానికి అప్లై చేసే ఫేస్‌మా్‌స్కలో చిటికెడు సోడా ఉప్పు కలపాలి.

గుండె ఆరోగ్యం: గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా ఉండాలంటే పావు గ్లాసు నీళ్లలో, ఒక టీస్పూను సోడా ఉప్పు కలిపి ప్రతిరోజూ క్రమం తప్పక తాగుతూ ఉండాలి.

చుండ్రు: చుండ్రు సమస్య వేధిస్తుంటే, నిమ్మరసంలో సోడా ఉప్పు కలిపి, తలకు పట్టించి మర్దన చేయాలి. గంట తర్వాత ఎక్కువ నీళ్లతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే, చుండ్రు దరిచేరదు.

మృతచర్మం: ముఖం మీద మిగిలిపోయే మృతకణాలు వదలాలంటే, మాయిశ్చరైజర్‌కు చిటికెడు సోడా ఉప్పు చేర్చి, అది కరిగేదాకా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, మృదువుగా రుద్దుకుని, కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే, చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

దుస్తులు మృదువుగా: దుస్తులు గరుకుబారి ఇబ్బంది పెడుతుంటే, రెండు కప్పుల కోషర్‌ సాల్ట్‌కు, కొన్ని చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌, అర కప్పు బేకింగ్‌ సోడాలను కలిపి ఓ సీసాలో నింపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వాషింగ్‌ మిషన్‌లో దుస్తులు ఉతికే ప్రతిసారీ, వాషింగ్‌ పౌడర్‌తో పాటు ఒక టీస్పూను వేస్తూ ఉండాలి. ఇలా తయారుచేసుకున్న మిశ్రమం పది ఉతుకుల వరకూ ఉపయోగపడతుంది.

గుడ్లు: గుడ్లు చక్కగా ఉడికి, తోలు తేలికగా రావాలంటే గుడ్లు ఉడకబెట్టే నీళ్లలో అర టీస్పూను సోడా ఉప్పు కలపాలి. ఇలా చేస్తే, గుడ్ల తొక్కు తేలికగా ఊడి వస్తుంది.

జీర్ణశక్తి: పావు కప్పు నీళ్లలో టీ స్పూను సోడా ఉప్పు కలిపి పరగడుపున తాగితే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఈ నీళ్లతో తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవడానికి అవసరమైన విధంగా జీర్ణవ్యవస్థ పిహెచ్‌ బ్యాలెన్స్‌ సమం అవుతుంది. ఫలితంగా ఎసిడిటీ, పొట్టలో నొప్పి లాంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

కూరగాయలు: వంటకు ముందు కూరగాయలకు పట్టిన హానికారక ఎరువులు, పురుగుమందులు వదలాలంటే సోడా ఉప్పు కలిపిన నీటిలో కూరగాయలను కడగాలి. 

కడుపు ఉబ్బరం: కడుపులో చేరుకునే వాయువులతో తలెత్తే కడుపు ఉబ్బరం చెప్పలేనంత అసౌకర్యాన్ని  కలిగిస్తుంది. ఈ సమస్య వదలాలంటే పావు గ్లాసు నీళ్లలో టీస్పూను సోడా ఉప్పు కలిపి తాగాలి.

చమట మరకలు: దుస్తులకు అంటుకున్న చమట మరకలు వదలాలంటే పావు కప్పు నీళ్లలో నాలుగు టీస్పూన్ల సోడా ఉప్పు కలిపి, ముద్దగా చేసుకోవాలి. మరకలు ఉన్న చోట తడిపి, దాని మీద సోడా ఉప్పు ముద్ద పూసి, అరగంట పాటు వదిలేయాలి. తర్వాత రుద్ది, సబ్బుతో కడిగేస్తే మరకలు వదులుతాయి.

దంతాలు మెరవాలంటే...: దంతాలు పచ్చబారి అందవిహీనంగా తయారైతే, సోడా ఉప్పుతో నేరుగా దంతాలను రుద్దకూడదు. ఇలా చేస్తే దంతాల ఎనామిల్‌ దెబ్బతింటుంది. కాబట్టి సోడా ఉప్పు కలిసిన టూత్‌పే్‌స్ట ఎంచుకోవాలి.

స్నీకర్స్‌ తెల్లగా: మురికిపట్టిన స్నీకర్స్‌ తెల్లగా మారాలంటే సోడా ఉప్పు, డిటర్జెంట్‌ రెండూ సమపాళ్లలో కలిపి, దాంతో మరకలు ఉన్న ప్రదేశంలో రుద్దాలి. తర్వాత ఎక్కువ నీళ్లతో కడిగితే స్నీకర్స్‌ కొత్తవిలా మారతాయి.

గోర్లు తెల్లగా: తరచుగా గోళ్ల రంగు వాడడం వల్ల, కాలి బొటనవేలి గోళ్లు పచ్చబారితే, సోడా ఉప్పు, నిమ్మరసం, టూత్‌పే్‌స్ట సమపాళ్లలో కలిపి, పాత టూత్‌బ్ర్‌ష సాయంతో గోళ్లను రుద్దాలి. ఇలా చేస్తే గోళ్లు పచ్చదనం వదిలిపోయి తెల్లగా మారతాయి.

Updated Date - 2022-04-07T19:15:56+05:30 IST