చుండ్రు పోవాలంటే...!

ABN , First Publish Date - 2021-02-11T17:56:16+05:30 IST

చుండ్రు సమస్య చిన్నదిగా కనిపిస్తుంది. కానీ ఆ సమస్యే కొందరిని తీవ్రంగా వేధిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వదలదు. అలాంటప్పుడు ఇలా చేసి చూడండి.

చుండ్రు పోవాలంటే...!

ఆంధ్రజ్యోతి(11-02-2021)

చుండ్రు సమస్య చిన్నదిగా కనిపిస్తుంది. కానీ ఆ సమస్యే కొందరిని తీవ్రంగా వేధిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వదలదు. అలాంటప్పుడు ఇలా చేసి చూడండి. 


మూడు రోజులకొకసారి షాంపూతో స్నానం చేయాలి. అయితే ఏ షాంపూ సరిపోతుందో ముందుగా తెలుసుకొని ఉపయోగించాలి. 


ఇంట్లో ఒకే దువ్వెనను అందరూ వాడుతుంటారు. అలా కాకుండా చుండ్రు ఉన్నవారు సెపరేట్‌గా దువ్వెన ఉపయోగించాలి.


తగినంత సమయం నిద్రపోకపోయినా చుండ్రు సమస్య వేధిస్తుంటుంది. ఒత్తిడి ఎక్కువగా ఉండటం కూడా కారణమే. కాబట్టి సమయానికి నిద్ర పోవాలి. 


రోజూ అరగంట ధ్యానం, యోగా చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి.


చుండ్రును పోగొటడానికి తులసి ఆకులు బాగా పనిచేస్తాయి. తులసి ఆకుల్లో యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఉంటాయి. 


తులసి ఆకులతో...

కొన్ని తులసి ఆకులను తీసుకుని అందులో రెండు టీస్పూన్ల ఉసిరికాయ పొడి కలిపి, కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును తలకు పట్టించాలి. మాడుకు పట్టేలా మర్దన చేయాలి. అరగంట పాటు ఆరనివ్వాలి. తరువాత నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య పోవడమే కాకుండా జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి. జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య దూరమవుతుంది. 

Updated Date - 2021-02-11T17:56:16+05:30 IST