ఎన్టీఆర్‌కు ఘన నివాళి

ABN , First Publish Date - 2022-01-19T04:38:52+05:30 IST

టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 26వ వర్ధంతిని మంగళవారం జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో జూనియర్‌ నాయకులు, చౌక్‌బజార్‌లో సీనియర్‌ నాయకులు వేర్వేరుగా ఘనంగా జరుపుకున్నారు.

ఎన్టీఆర్‌కు ఘన నివాళి
పేటలో ఎన్టీఆర్‌ చిత్ర పటానికి నివాళి అర్పిస్తున్న టీడీపీ నాయకులు

- ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి 

- వర్ధంతి సభలో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు

- ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ

నారాయణపేట, జనవరి 18 : టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 26వ వర్ధంతిని మంగళవారం జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో జూనియర్‌ నాయకులు, చౌక్‌బజార్‌లో సీనియర్‌ నాయకులు వేర్వేరుగా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళిఅర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో టీడీపీ జూనియర్‌ నాయకులు పార్లమెంట్‌ ప్రచార కార్యదర్శి వినయ్‌ మిత్ర, భాస్కర్‌, ప్రసాద్‌, యాబన్న, మహేందర్‌, రామకృష్ణ, శ్రీకాంత్‌, వీరన్న, రమేష్‌, భీమన్న, కిష్టప్ప, సీనియర్‌ నాయకులు జహీర్‌ ఆహ్మద్‌, ఓంప్రకాష్‌, గోపాల్‌, కనకప్ప, వీరన్న, గజలప్ప, శివప్ప, రాములు, బుగ్గప్ప, తిమ్మన్న, రమేష్‌, చెన్నప్ప పాల్గొన్నారు.

మక్తల్‌ : టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 26వ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని ఎన్టీ రామారావు విగ్రహానికి ఆ పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ ఉమ్మడి జిల్లా పార్లమెంట్‌ ఇన్‌చార్జి మధుసూదన్‌ మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు సిద్దార్థరెడ్డి, నాయకులు అనిల్‌ కుమార్‌గౌడ్‌, విష్ణువర్ధన్‌రెడ్డి, భీమేష్‌, చంద్రకాంత్‌, నరేష్‌, ఆంజనేయులు, రాంరెడ్డి, రవి, వెంకటేష్‌ పాల్గొన్నారు. 

కృష్ణ : దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వర్ధంతిని మండలంలోని హిందూ పూర్‌, మురాహర్‌దొడ్డి గ్రామాల్లో ఆ పార్టీ మండలాధ్యక్షుడు రాకేష్‌, సర్పంచు లక్ష్మి నారాయణగౌడ్‌ ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచు సద్ధామ్‌, హుస్సేనప్ప పాల్గొన్నారు.

దామరగిద్ద : దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలో టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకుడు రాములుయాదవ్‌, మండలాధ్యక్షుడు తి మ్మారెడ్డి, మొగులప్ప, రాములు, నాగప్ప, నందు, అంజప్ప, వెంకటప్ప ఉన్నారు. 

ధన్వాడ : ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా మంగళవారం ధన్వాడలో టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ చిత్రటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకుల ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు అలుగుమీది భాస్కర్‌, అజీమోద్దీన్‌ పాల్గొన్నారు.

నర్వ : ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహానికి ఆయన అభిమానులు పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్‌ అభిమాన సంఘం నాయకులు జగన్‌మోహన్‌రెడ్డి, కుర్మారెడ్డి, రాములు గౌడ్‌, వెంటయ్య, రఫీక్‌, శ్రీనివాస్‌రావు, బొజ్జన్న, జగన్నాత్‌,  వెంకట్‌రాంరెడ్డి, ఎల్లారెడ్డి, రాంచంద్రారెడ్డి, కుర్వ అయ్యలు తదితరులు పాల్గొన్నారు  

మాగనూరు : మండల కేంద్రంలో టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు చిత్ర పటానికి ఆపార్టీ నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. టీడీపీ మండలాధ్యక్షుడు రవీందర్‌ మాట్లాడుతూ పేద ప్రజలకు రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మాగనూరు పట్టణ అధ్యక్షుడు గట్టు నరేష్‌, మండల ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌, రవి, నాగరాజు, కల్యాణ్‌ పాల్గొన్నారు.






Updated Date - 2022-01-19T04:38:52+05:30 IST