ఎన్టీఆర్‌కు ఘన నివాళి

ABN , First Publish Date - 2021-01-19T05:29:03+05:30 IST

కడప గడపన తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సోమవారం టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కడప నగరంలో టీడీపీ నేత పీరయ్య ఆధ్వర్యంలో రక్తదానం, పారిశుధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు.

ఎన్టీఆర్‌కు ఘన నివాళి
కడపలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న టీడీపీ నేతలు

పూల మాలలు వేసి నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు 

కడప, రాజంపేట, కాశినాయన మండలాల్లో రక్తదానం

పలు చోట్ల రోగులకు పండ్లు పంపిణీ

కడప, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): కడప గడపన తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సోమవారం టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కడప నగరంలో టీడీపీ నేత పీరయ్య ఆధ్వర్యంలో రక్తదానం, పారిశుధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు. టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలిసెట్టి హరిప్రసాద్‌, కడప అసెంబ్లీ నియోజకవర్గం ఇనచార్జి అమీర్‌బాబు, నగర ప్రధాన కార్యదర్శి వికాస్‌హరి పాల్గొన్నారు. అంతకు ముందు ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయులు ఆధ్వర్యంలో రాజంపేట హైవే సర్కిల్లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజంపేటలో 100 మంది రక్తదానం చేశారు. వరద ముంపు గ్రామం హేమాద్రివారిపల్లెలో 300 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కాశినాయన మండలం నరసాపురం గ్రామంలో తెలుగుమహిళ కడప పార్లమెంట్‌ అధ్యక్షురాలు శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో  రక్తదానం చేశారు. రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్‌రెడ్డి, బద్వేలులో గత ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థి రాజశేఖర్‌, మైదుకూరులో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, ప్రొద్దుటూరులో పార్టీ ఇనచార్జి డాక్టరు జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, జమ్మలమడుగులో టీఎనఎనఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, రైల్వేకోడూరులో టీడీపీ ఇనచార్జి కస్తూరి విశ్వనాథనాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పలు చోట్ల రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

Updated Date - 2021-01-19T05:29:03+05:30 IST