జీవన ఎరువులతో భూమికి సారం

ABN , First Publish Date - 2020-12-06T05:12:14+05:30 IST

జీవన ఎరువులతో భూమి సారవంతం అవు తుందని, ఎరువులు పురుగుల మందులు అధికంగా వాడటం వలన నష్టం చేకూరుతుందని ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు.

జీవన ఎరువులతో భూమికి సారం

వీరవాసరం, డిసెంబరు 5: జీవన ఎరువులతో భూమి సారవంతం అవు తుందని, ఎరువులు పురుగుల మందులు అధికంగా వాడటం వలన నష్టం చేకూరుతుందని ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా కేవీకే ఆధ్వర్యంలో మత్స్యపురిలో శనివారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నేల పరిస్థితిని తెలియజేస్తూ భూమి సారవంతంగా ఉన్నప్పుడు పంటలు బాగా పండుతాయన్నారు. జీవన ఎరువుల ఉపయోగాలు, ఎరువులు, పురుగుల మందుల వాడకం నష్టాలను వివరించారు. సేంద్రియ ఎరువులు వాడటం వలన నేల ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు. ప్రతీరైతు నేల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. శాస్త్రవేత్తలు ఎంవీ.కృష్ణాజీ, బిందు ప్రసన్న, కె.అనిల్‌కుమార్‌, బి.విజయ్‌రేచన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T05:12:14+05:30 IST