Viral news: 'సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయితే ఫోన్‌ చేయొద్దు..' వైరలవుతున్న 24ఏళ్ల యువతి మ్యాట్రిమోనియల్‌ ప్రకటన..!

ABN , First Publish Date - 2022-09-21T15:35:30+05:30 IST

ఒకప్పుడు పెళ్లి సంబంధాలు అంటే అమ్మాయి తరపువారు, అబ్బాయి తరపువారు ఒకరి ఇండ్లకు మరొకరు వెళ్లి మాట్లాడుకోవడం చేసేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్‌ మారింది.

Viral news: 'సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయితే ఫోన్‌ చేయొద్దు..' వైరలవుతున్న 24ఏళ్ల యువతి మ్యాట్రిమోనియల్‌ ప్రకటన..!

ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు పెళ్లి సంబంధాలు అంటే అమ్మాయి తరపువారు, అబ్బాయి తరపువారు ఒకరి ఇండ్లకు మరొకరు వెళ్లి మాట్లాడుకోవడం చేసేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్‌ మారింది. వరుడు, వధువుల కోసం వేట ఇప్పుడు న్యూస్ పేపర్లు, ఆన్‌లైన్‌ వేదికగా జరుగుతున్నది. ఇక డిమాండ్‌కు తగ్గట్టుగానే మ్యాట్రిమోనియల్‌ సైట్లకు కొదవలేకుండా పోయింది. ఈ క్రమంలో 'వరుడు కావాలి', 'వధువు కావాలి' అంటూ వస్తున్న కొన్ని మ్యాట్రిమోనియల్‌ ప్రకటనలు వైరల్ కావడం మనం చాలాసార్లు చూశాం. తాజాగా ఇలాంటి ఓ ప్రకటన నెట్టింట తెగ వైరలవుతోంది. 24 ఏళ్ల అందమైన యువతికి వరుడు కావలేను అనేది ఆ ప్రకటన. అయితే, ‘సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయితే ఫోన్‌ చేయొద్దు..’ అంటూ ప్రత్యేకంగా పేర్కొనడమే ఈ ప్రకటన వైరల్‌గా మారడానికి కారణమైంది. 


అసలు ప్రకటనలో ఏముందంటే..

ధనిక వ్యాపార కుటుంబ నేపథ్యం ఉన్న ఎంబీఏ చదివిన 24 ఏళ్ల అందమైన అమ్మాయికి ఐఏఎస్‌/ఐపీఎస్‌ లేదా డాక్టర్‌, పారిశ్రామికవేత్త అయిన అబ్బాయి కావాలని ప్రకటన ఇచ్చారు. చివరిలో ‘సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయితే దయచేసి కాల్‌ చేయొద్దు’ అంటూ ప్రత్యేకంగా చెప్పడం గమనార్హం. ఈ ప్రకటనపై నెటిజన్లు సోషల్ మీడియాలో (social media) తమదైనశైలిలో స్పందిస్తున్నారు. సమీర్‌ అరోరా అనే ట్విటర్ యూజర్ ఈ ప్రకటనకు సంబంధించిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ఐటీ భవిష్యత్తు అంత మంచిగా కనిపించడం లేదు’ అనే క్యాప్షన్ పెట్టారు. ఇప్పుడీ మ్యాట్రిమోనియల్‌ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.  



Updated Date - 2022-09-21T15:35:30+05:30 IST