గుంట నక్కలు బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు

ABN , First Publish Date - 2022-07-05T05:53:10+05:30 IST

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పా ర్టీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ గుంట నక్కల్లా మారా యని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు.

గుంట నక్కలు బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

జగిత్యాల టౌన్‌, జూలై 4: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పా ర్టీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ గుంట నక్కల్లా మారా యని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు.  జిల్లా కేంద్రంలో సోమవారం పట్టణ బూత్‌ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ హాజరై అత్యధిక స భ్యత్వాల నమోదుకు కృషి చేసిన నాయకులను షాలువాలతో సన్మానిం చారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జీవన్‌రెడ్డి మా ట్లాడు తూ ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్‌ పార్టీపై బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు పనిగట్టుకుని అసత్యపు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రజలు గమనిస్తు న్నారని, రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదన్నారు. కాంగ్రెస్‌ పా ర్టీకి ప్రజల్లో మంచి గుర్తిపు ఉందని సభ్యత్వాల నమోదు కార్యక్రమమే దీనికి ఊదాహరణ అన్నారు. దేశంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న పరి ణామాలు చూస్తుంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమైందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్ర టరీ బండ శంకర్‌, టీపీసీసీ సభ్యుడు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గిరి నాగభూషణం, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు విజయ లక్ష్మి. పట్ట ణ అధ్యక్షుడు కొత్త మోహన్‌, ప్లోర్‌ లీడర్‌ కల్లెపల్లి దుర్గయ్య, ఆవేజ్‌, మన్సూర్‌ ఉన్నారు.

ఫజిల్లా కేంద్రంతో పాటు మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురి గదిలో ఉన్న ఫ్రీజర్లు పనిచేయడం లేదని తక్షణమే మరమ్మతులు చేయిం చాలని కలెక్టర్‌కు సోమవారం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రత్యేక లేఖ రాసారు.  

Updated Date - 2022-07-05T05:53:10+05:30 IST