సమాజమే కేంద్రంగా విద్యను అందించాలి

ABN , First Publish Date - 2022-08-17T05:56:19+05:30 IST

సమాజాన్ని కేంద్రంగా చేసుకుని విద్యను అందించాలని ఏపీ సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ (విజయనగరం) వీసీ కట్టిమణి అన్నారు. మంగళవారం ఏయూ రసాయనశాస్త్ర విభాగ సమావేశ మందిరంలో ఏయూ, ఏపీ సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ, ఎన్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో నేషనల్‌ కరికులం ఫ్రేమ్‌వర్క్‌ అంశంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగిస్తూ విద్యార్థికి ఉపయుక్తంగా ప్రాఽథమిక విద్యను బలోపేతం చేయాలని సూచించారు.

సమాజమే కేంద్రంగా విద్యను అందించాలి
సమావేశంలో ప్రసంగిస్తున్న ఏపీ సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ వీసీ కట్టిమణి

ఏపీ సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ వీసీ కట్టిమణి

ఏయూ క్యాంపస్‌, ఆగస్టు 16: సమాజాన్ని కేంద్రంగా చేసుకుని విద్యను అందించాలని ఏపీ సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ (విజయనగరం) వీసీ కట్టిమణి అన్నారు. మంగళవారం ఏయూ రసాయనశాస్త్ర విభాగ సమావేశ మందిరంలో ఏయూ, ఏపీ సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ, ఎన్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో నేషనల్‌ కరికులం ఫ్రేమ్‌వర్క్‌ అంశంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన  ప్రసంగిస్తూ విద్యార్థికి ఉపయుక్తంగా ప్రాఽథమిక విద్యను బలోపేతం చేయాలని సూచించారు. ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ నైపుణ్యాలతో యువతను సుసంపన్నం చేయాలని, పాఠశాల స్థాయి నుంచి నైపుణ్యం, క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఆర్‌ఐఈ, ఎన్‌సీఈఆర్‌టీ మైసూర్‌ ప్రిన్సిపాల్‌ ఆచార్య వై.శ్రీకాంత్‌ మాట్లాడుతూ విద్యలో నాణ్యతను పెంపొందించడం ప్రధానమని, గ్లోబల్‌ సిటిజన్స్‌గా తీర్చిదిద్దాలని కోరారు. విద్యాభారతి నేషనల్‌ ప్రెసిడెంట్‌ డి.రామకృష్ణారావు మాట్లాడుతూ 2030 నాటికి అందరికీ నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యమని, దేశంలో 1.5 కోట్ల మంది అధ్యాపకులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఏయూ రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌, ఆచార్యులు పి.జార్జివిక్టర్‌, జి.నాగేశ్వరరావు, సుదర్శనరావు, రాంజీ పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-17T05:56:19+05:30 IST