కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని బోర్డు తిప్పేసిన సొసైటీ

ABN , First Publish Date - 2022-06-11T01:06:13+05:30 IST

Anakapalli: అనకాపల్లిజిల్లాలో నిరుద్యోగులు మోసపోయారు. ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ఒక్కొక్క నిరుద్యోగి నుంచి రూ. 5 లక్షల నుంచి రూ. 7

కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని బోర్డు తిప్పేసిన సొసైటీ

Anakapalli: అనకాపల్లి జిల్లాలో నిరుద్యోగులు మోసపోయారు. ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ  ఒక్కొక్క నిరుద్యోగి నుంచి రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలు వసూలు చేశారు. నెలకు రూ. 20 వేలు జీతం అని నమ్మించారు. ఈ వ్యవహారంలో రాజమండ్రి ఎంపీ భరత్ పీఎ ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఎంపీ కోటాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి రూ. 5 లక్షలను పీఎ చిన్నంశెట్టి కార్తీక్  వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మోసపోయామని గ్రహించిన బాధితులు నర్సీపట్నంలోని సొసైటీ కార్యాలయం ముందు బైఠాయించారు. సొసైటీ ఛైర్మన్ ఇందుకూరి సుధాకర్  మొహం చాటేశారు. ప్రతి జిల్లాలో 4వేల నుంచి 5 వేల మంది నిరుద్యోగులు డబ్బులు కట్టారని బాధితులు చెబుతున్నారు. 

Updated Date - 2022-06-11T01:06:13+05:30 IST