మొక్కలు నాటడం సామాజిక బాధ్యత

ABN , First Publish Date - 2021-06-24T05:32:08+05:30 IST

మొక్కలు నాటడం సామాజిక బాధ్యత

మొక్కలు నాటడం సామాజిక బాధ్యత
చీలాపూర్‌లో మొక్కలు నాటుతున్న సర్పంచ్‌, కార్యదర్శి, సిబ్బంది

పూడూరు: ప్రతీ గ్రామంలో మొక్కలను నాటి అవి వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించడం సామాజిక బాధ్యత అని పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు అన్నారు. ప్రభుత్వం ఏడో విడత హరితహారానికి సమా యత్తం అవుతున్న నేపథ్యంలో గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటి నుంచే కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నారు. బుధవారం పూడూరు మండలం చీలాపూర్‌లో పంచాయతీ కార్యదర్శి శృతితో కలిసి సర్పంచ్‌ రాములు రోడ్డుకు ఇరువైపులా, గ్రామంలోని ఖాళీ స్థలాల్లో 400 మొక్కలు నాటారు. రాబో యే తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కల పెంపకాన్ని విరివిగా చేపట్టాలని సర్పంచ్‌ అన్నారు. ప్రతీ మొక్క వృక్షంగా ఎదిగే వరకు కాపాడే బా ధ్యత గ్రామస్థులదేనని, వారి సహకారంతో అభివృద్ధి సాధ్యమన్నారు.


  • మొక్కలు నాటి వదిలేస్తే సరిపోదు : ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి


తాండూరు: మొక్కలు నాటి వదిలేస్తే సరిపోదని, వాటి సంరక్షణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఏడో విడత హరి హారంపై మండలంలోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గాన్ని హరితవనంగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలన్నారు. అన్ని మండలాల్లో నిర్దేశించుకున్న ల క్ష్యాన్ని పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతీ ఇంటికి ఆరు మొక్కలను పంపి ణీ చేయాలన్నారు. అధికారులు గుంతలు తవ్వించి, నాటిన మొక్కలకు సైడ్‌స్టిక్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. టేకు, వేప, చింత, బాదం, గులాబీ, మందార, నిమ్మ, దానిమ్మ, జామ, ఉసిరి మొక్కలను ఇళ్ల పరిసరాల్లో నా టించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ఎక్కడ మొక్కలు నాటాలో అధికారులు గుర్తించాలన్నారు. నర్సరీలను పెంచి, రోడ్లకు ఇరువైపులా, అంగన్‌వాడీ సెంటర్ల వద్ద, స్కూళ్ల కాంపౌండ్‌ వాల్‌ చుట్టూ మొక్కలను పెంచాలన్నారు. నాటిన ప్రతీ మొక్కను సంరక్షించి అవి వృక్షాలయ్యే వరకు ప్రతీఒక్కరం కృషిచేయాలన్నారు. పరిసరాల పచ్చదనంతో ప్రజల జీవనం ఆరోగ్యకరంగా, ఆనందకరంగా ఉంటుందని రోహిత్‌రెడ్డి అన్నారు. మొక్కల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావులేదని, ఈ బాధ్యత సర్పంచ్‌లు, వా ర్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులదేనని హెచ్చరించారు.


  • పల్లె ప్రగతికి పాటుపడాలి


మూడుచింతలపల్లి/కీసర/ఘట్‌కేసర్‌ రూరల్‌/మేడ్చల్‌: పల్లెల అభివృద్ధికి అహర్నిశలు పాటుపడాలని, పల్లెలను అందంగా ఆదర్శగా తీ ర్చిదిద్దేందుకు శ్రమించాలని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్‌ జాన్‌ శ్యాంసన్‌ అన్నారు. బుధవారం మూడుచింతలపల్లి పంచాయతీలో ఎంపీపీ హారికమురళీగౌడ్‌ ఆధ్వర్యంలో అడిషనల్‌ కలెక్టర్‌ అధ్యక్షతన సీజ నల్‌ వ్యాధులు, హరితహారంపై మండల స్థాయి సమీక్ష నిర్వహించారు. శ్యాంసన్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ‘ఊరం తా ఒక్కటైదాం.. ఊరికోసం పనిచేద్దాం’ అనే నినాదంతో ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ప్రతి రెండు నెలలకు ఒక సారి గ్రామసభ నిర్వహించాలన్నారు. హరితహారంలో నాటిన 85శాతం మొక్కలు పెరిగేలా చూడాలన్నారు. లేని పక్షంలో సదరు పంచాయతీ పాలకవర్గాన్ని రద్దు చేస్తామని అధికారి హెచ్చరించారు. పంచాయతీకి ప్రతి నెలా వచ్చే డబ్బులో మొదట సిబ్బంది జీతాలు, విద్యుత్‌ బిల్లులు, ట్రాక్టర్ల కిస్తులు చెల్లించాలన్నారు. ప్రతి గ్రామ ప్రొఫైల్‌ ఎప్పటికప్పడు అప్డేట్‌ చేయాలని కార్యదర్శులను ఆదేశించారు. కార్యక్రమంలో సీఈవో దేవసహాయం, ఈఈపీఆర్‌ రామ్మోహన్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో నారాయణ, ఎం పీడీవో సువిధ, డాక్టర్‌ దమయంతి, అంగన్‌వాడీ సూపర్‌ వైజర్‌ జయశీల, సర్పంచ్‌ జామ్‌రవి, సర్పంచులు, ఎంపీటీసీలు, పాల్గొన్నారు. కీసర మండ లం కరీంగూడలో అదనపు కలెక్టర్‌ పర్యటించారు. ఏడో విడత హరితహార ంలో నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తిచేయాలన్నారు. ఆయన వెంట సర్పంచ్‌ గోపా ల్‌రెడ్డి, వార్డుసభ్యులున్నారు. మొక్కలు నాటి సంరక్షించినప్పుడే హరితహారం విజయవంతం అవుతుందని కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీ నారాయణ అన్నారు. చీర్యాలలో ఆమె మొక్కలు నాటారు. నాటిన మొక్కలను సంరక్షించినప్పుడే హరితహారం విజయవంతం అవుతుందన్నారు. సర్పంచ్‌ ధర్మేందర్‌, ఉపసర్పంచ్‌ తిరుమల్‌రెడ్డి పాల్గొన్నారు. హరితహారా న్ని విజయవంతం చేయాలని మేడ్చల్‌ జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి అన్నారు. ఘట్‌కేసర్‌ మండలం వెంకటాపూర్‌లో ఆయన పల్లెప్ర కృతి వనం, నర్సరీ, వైకుంఠదామం, డంపింగ్‌యార్డులను పరిశీలించి పం చాయతీ రికార్డులను చూశారు. హరితహారంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. సర్పంచ్‌ గీతశ్రీనివాస్‌, కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హరితహారంలో ప్రజలందరు భాగస్వాములు కావాలని మేడ్చల్‌ మున్సిపల్‌ 16వ వార్డు కౌన్సిలర్‌ ఉమనాగరాజు కోరారు. వార్డులో మొక్కలు నాటేందుకు గుంతలు తీయించారు. ఆమె మాట్లాడుతూ వార్డులో విరివిగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. బిల్‌ కలెక్టర్‌ పెంటయ్య, సంజీవ, జకీర్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T05:32:08+05:30 IST